చిన్నారి నోట్లో పేలిన.. చైనా బ్యాటరీ

చిన్నారి నోట్లో పేలిన.. చైనా బ్యాటరీ

మహారాష్ట్రలోని నాగ్ పూర్ కు చెందిన 9ఏళ్ల బాలుడి నోట్లో చైనా బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆ బాలున్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అతని తండ్రి ఓ కూలీ కాగా, తాత రైల్వేలో పనిచేస్తున్నాడు.

ఎలా పేలిందంటే..

ఓ చిన్న మోటార్ ను వైర్ తో కనెక్ట్ చేసి పేపర్ ఫ్యాన్ తో బాలుడు ఆడుకుంటుండగా.. నోట్లో బ్యాటరీ పెట్టుకుని వైర్ కి కనెక్ట్ చేశాడు. అలా ఫ్యాన్ ను ఆన్ చేయడం స్టార్ట్ చేశాడు. ఇది జరిగిన కొద్ది క్షణాల్లోనే బ్యాటరీ వేడెక్కి నోట్లో పేలింది.

చైనీస్ ఉత్పత్తులు ఎంత సురక్షితమైనవంటే..

చైనీస్ ఉత్పత్తులు పేలి చిన్నారికి గాయాలు కావడం ఇదేం మొదటిసారి కాదు. అంతకుముందు తమ ఇంటి సమీపంలో స్టడీ టేబుల్ పై ఉంచిన చైనీస్ మొబైల్ ఫోన్ పేలి 16ఏళ్ల బాలుడికి, అతని 11ఏళ్ల సోదరికి కాలిన గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం వారు చదువుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వారు ఆన్ లైన్ లో పాఠాలు వింటుండగా ఈ పేలుడు జరిగిందని కుటుంబసభ్యులు వెల్లడించారు. ఈ క్రమంలో పిల్లలు ఆడుకుంటున్నపుడు లేదా చదువుకుంటున్నపుడు మొబైల్ ఫోన్స్, లేదా మరేదైనా ఎలక్ట్రానిక్ వస్తువులు ఉపయోగించేటప్పుడు వారిపై నిఘా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.