దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌

దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌

హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హజరయ్యారు. ఈ సందర్భంగా యువ పైలెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం యువ పైలెట్లతో పాటు ఇతర దేశాల సైనికాధికారులు విన్యాసాల్లో పాల్గొన్నారు. పరేడ్ లో యువ పైలెట్ల ప్రదర్శన ఆకట్టుకుంది. 

ఈ కార్యక్రమంలో శిక్షణ పొందిన 212 మంది యువ పైలైట్లు పాల్గొన్నారు. పిలాటస్ పీసీ-7 ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్, సుఖోయ్-30, సారంగ్ హెలికాఫ్టర్లతో విన్యాసాలు ప్రదర్శించారు. పరేడ్ అనంతరం అధికారికంగా యువ పైలెట్లు ఎయిర్ ఫోర్స్‌లో అడుగుపెట్టనున్నారు. 

శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు అందించారు. క్యాడెట్లకు బాధ్యత మరింత పెరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పారు. దేశ గౌరవం, దేశ భద్రత వారిపై ఉంటుందన్నారు. సరికొత్త ఇన్నోవేషన్ లు వస్తున్నాయని తెలిపారు. టెక్నాలజీకి అనుగుణంగా అప్డేట్ అవ్వాలని సూచించారు. ట్రెడిషన్, ఇన్నోవేషన్.. రెండింటినీ కలుపుకొని పోతూ బాధ్యత నిర్వర్తించాలన్నారు. సంప్రదాయాలను పాటించాలి.. గౌరవించాలి అని చెప్పారు.