HCA స్కామ్ ఎఫెక్ట్.. ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

HCA స్కామ్ ఎఫెక్ట్.. ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు

హైదరాబాద్: ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. తనకు సంబంధం లేని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‎సీఏ) వ్యవహారంలో తలదూర్చడంతో ఎలక్షన్ రెడ్డిపై వేటు వేశారు అధికారులు. కాగా, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్‎లో భారీగా నిధుల అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై హెచ్‎సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావుతో పాటు హెచ్‎సీఏ సెక్రటరీ దేవరాజ్, ట్రెజరర్ జగన్నాథ్ శ్రీనివాస్ రావు, సీఈవో సునీల్ కుమార్, శ్రీ చక్ర క్రికెట్ క్లబ్ జనరల్ సెక్రెటరీ రాజేందర్ యాదవ్, రాజేందర్ యాదవ్ భార్య కవిత మొత్తం ఆరుగురిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. 

►ALSO READ | వారెన్ బఫెట్ గోల్డెన్ రూల్స్.. ఈ 5 వృధా ఖర్చులు మిమ్మల్ని దివాలా తీయిస్తాయ్!

ఈ కేసులో ఏ2గా ఉన్న దేవరాజ్‎ను తప్ప మిగిలిన అధికారులను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. దేవరాజ్ మాత్రం పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్నారు. దేవరాజ్ పరార్ కావడానికి ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డే కారణమని అధికారులు గుర్తించారు. దేవరాజ్ అరెస్ట్‎కు  సీఐడీ రంగం సిద్ధం చేయగా.. అరెస్ట్ సమాచారాన్ని ముందుగానే దేవరాజ్‎కు చేరవేశాడు ఎలక్షన్ రెడ్డి. దీంతో దేవరాజ్ సీఐడీకి చిక్కలేదు. సీఐడీ సమాచారాన్ని ముందుగా లీక్ చేసినందుకు సీఐ ఎలక్షన్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు అధికారులు.