
Warren Buffett: ప్రపంచ కుబేరుల్లో ఎప్పుడు టాప్ 10 స్థానాల్లోనే ఉండే వారెన్ బఫెట్ ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఇన్వెస్టర్లకు స్పూర్తి. ఆయన మాటల్లో జాగ్రత్తలు చెప్పటమే కాకుండా నిజ జీవితంలో అత్యంత సామాన్యమైన జీవితాన్ని గడిపి ఆచరణ రూపంలో కూడా పెట్టారు. అయితే నేటి ఆధునిక కాలంలో డబ్బును అనేక మార్గాల్లో వృధాగా ఖర్చు చేస్తున్నారు. లగ్జరీ కార్లు ఇళ్లు బ్రాండెడ్ వస్తువులు అంటూ సోషల్ మీడియా షోఆఫ్ కోసం చేస్తున్న పనులు లెక్కకు మించి. అయితే వారెన్ బఫెట్ చెబుతున్న కొన్ని సూత్రాలు ఆర్థిక స్వేచ్ఛ దిశగా మిమ్మల్ని ఎలా నడిపించగలవో ఇప్పుడు తెలుసుకోండి. ఇది నిజంగా మీరు డబ్బును చూసే దృక్కోణాన్ని పూర్తిగా మార్చేస్తుంది.
94 ఏళ్ల సంపన్నుడు వారెన్ బఫెట్ డబ్బును వృధాగా ఖర్చుపెట్టకుండా దానిని ఎలా రక్షించుకోవాలనే చిన్న సూత్రాల గురించి ఇప్పుడు చూద్దాం..
1. నేటి కాలంలో చాలా మంది మంచి ఉద్యోగం లేదా ప్రమోషన్ పొందగానే చేస్తున్నది ఖరీదైన కార్లను కొనుగోలు చేయటం. కానీ దీనిని బఫెట్ పెద్ద తప్పని చెబుతున్నారు. కారు విలువ షోరూం నుంచి బయటకు వచ్చిన మరుక్షణం నుంచే తరిగిపోతుందన్నారు. ఐదేళ్లలో దాని విలువ 60 శాతం కరిగిపోతుందన్నారు. ఇప్పటికీ బఫెట్ 2014లో ఎక్కువ డిస్కౌంటుకు కొన్న క్యాడిలాక్ ఎక్స్టీఎస్ వాడుతున్నారు. కారును కేవలం ప్రయాణ వాహనంగా మాత్రమే చూడాలని, దానిని మన సక్సెస్, షోఆఫ్ కోసం అన్నారు. పైగా దాని రన్నింగ్ ఖర్చులు రోజువారీ అదనపు డబ్బు వృధా చేస్తాయన్నారు.
2. ఇక భారతదేశంలో కరోనా మహమ్మారి కంటే వేగంగా విస్తరించాయి క్రెడిట్ కార్డుల వినియోగం. మధ్యతరగతి ప్రజలు క్రెడిట్ వినియోగానికి భానిసలుగా మారుతున్న వైనం గురించి వారెన్ బఫెట్ ఎప్పుడో హెచ్చరించారు. క్రెడిట్ కార్డుల అతి వినియోగంతో అప్పులో కూరుకుపోవటం.. వాటి చెల్లింపుల ఆలస్యంతో అధిక వడ్డీల భారాన్ని మోస్తున్న సంగతి తెలిసిందే. బిల్లులు కట్టలేక మిడిమం డ్యూ కట్టడం, దానిపై కొండలా పేరుకుపోయే వడ్డీ క్రమంగా అప్పుల ఊబిలోకి నెట్టేస్తాయని బఫెట్ చెబుతున్నారు.
3. బఫెట్ ఇదే క్రమంలో జూదం, లాటరీల కోసం డబ్బులు వేస్ట్ చేసుకోవద్దని చెప్పారు. వీటి వెనుక ఉండే లెక్కలు, టాక్స్ పరిణామాలు చాలా మందికి తెలియవన్నారు. ఈ అలవాట్లు కష్టపడి సంపాదించిన డబ్బును ప్రజల నుంచి కొల్లగొడతాయన్నారు. తొలినాళ్లలో ఇవి ఆనందాన్ని కలిగించిన తర్వాత రోడ్డన పడేస్తాయని హెచ్చరించారు. ఇది క్రమంగా మనిషిలోని ఆర్థిక క్రమశిక్షణను పాడుచేస్తాయని.. డబ్బు దాచుకునే ధోరణిని హరిస్తాయన్నారు. అలాగే నష్టాలు ఇచ్చే అవకాశం ఉన్న చోట్ల ఎప్పుడు మీ డబ్బులు ఇన్వెస్ట్ చేయెుద్దని బఫెట్ సూచిస్తూ ఉంటారు. ఇవి ఆర్థిక స్వేచ్చతో పాటు మానసిక ప్రశాంతతను హరిస్తాయని అన్నారు.
4. అవసరానికి మించి పెద్ద లగ్జరీ ఇల్లు కట్టడం లేదా కొనుగోలు చేయటం కూడా ఒక వృధా ఖర్చేనని బఫెట్ చెబుతున్నారు. ఆయన అమెరికాలో ఇప్పటికీ 1958లో కొనుగోలు చేసిన ఇంట్లోనే కొనసాగుతున్నారు. ఎంత పెద్ద ఇల్లు ఉంటే ఎంత ఎక్కువ పన్నులు, దాని కోసం మెయింటెనెన్స్ ఖర్చులు ఉంటాయని అన్నారు. ఇతరుల ముందు షోఆఫ్ కోసం లక్షలు అనవసరంగా ఖర్చు చేయెుద్దని చెబుతున్నారు బఫెట్.
5. ఇక చివరిగా బఫెట్ కీలక హెచ్చరిక ఏంటంటే.. ప్రజలు తమకు తెలియని కాంప్లెక్స్ పెట్టుబడి సాధనాల్లో డబ్బును పెట్టకపోవటం. అలాగే తెలియని వ్యాపారాల్లో కూడా డబ్బు ఇన్వెస్ట్ చేయెుద్దని ఆయన చెబుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బును తెలియని వాటిలో పెట్టి పోగొట్టుకోవటం తెలివితక్కువ తనం అన్నారు. వేగంగా సంపన్నుడిగా మారాలనే అత్యాస ఎప్పటికీ కోలుకోలేని కష్టాల్లోకి నెట్టేస్తాయని హెచ్చరించారు. తక్కువ కాలంలో ఎక్కువ రాబడి అంటూ ఎవరైనా ఆఫర్స్ ఇస్తే వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండటం మంచిదని బఫెట్ చెబుతున్నారు. మాట వినకపోతే తగిన భారీ మూల్యం చెల్లించుకుంటారని చివరిగి నిరారే మిగులుతుందని ఆయన అంటున్నారు.