
జిమ్ లో గంటలకొద్దీ వర్కవుట్స్ చేసినా బరువు తగ్గడం లేదా? కొత్తగా జిమ్ మొదలుపెడుతున్నారా? అయితే కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. చాలామంది ఇతరులు ఏది చేస్తే.. అదే ఫాలో అవుతుంటారు. దాంతో నెలలు గడిచినా బరువులో ఎలాంటి మార్పు కనిపించదు. వాటినే కామన్ మిస్టెక్స్ అంటారు. అలాంటివాళ్లు ఏం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !
చాలామంది గుడ్డిగా పర్కవుట్స్ చేస్తుంటారు. గంటల తరబడి జిమ్ చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఐదు నిమిషాలు వర్కవుట్స్ చేయగానే కొంతమందికి బాగా చెమట వస్తుంది. దాంతో ఎక్కువ వర్కవుట్స్ చేశామనే ఫీల్ తో ఉంటారు. చెమటతో ఎలాంటి క్యాలరీలు కరగవు. బాడీలో కొంత వేడి మాత్రం తగ్గుతుంది. కొవ్వు మాత్రం అలాగే ఉంటుంది.
యాబ్స్ తో కొంతే...
చాలామంది పొట్టను కరిగించేందుకు యాబ్స్ చేస్తారు. యాబ్స్ కొంతమేరకే పొత్తి కడుపుపై ఎఫెక్ట్ చూపుతాయి. పొత్తి కడుపు ఎక్సర్ సైజ్ వల్ల ఫ్యాట్ ఏ మాత్రం తగ్గదు. కొత్తగా వర్కవుట్స్ చేసేవాళ్లు ఇది కూడా తెలుసుకోవడం ముఖ్యమని నిపుణులు అంటున్నారు.
ముప్పైలో తగ్గొచ్చు
ముప్పైలో చాలామంది బరువు తగ్గలేమనుకుంటారు. మెటాబాలిజం.. హర్మోన్స్ తక్కువగా ఉంటాయని భావించి వెయిట్ ట్రైనింగ్ కు దూరంగా ఉంటారు. కానీ సరైన ట్రైనింగ్ తో ముప్పైలో కూడా బరువు తగ్గొచ్చు. ఫిట్ నెస్ ట్రైయినర్లను సంప్రదించి వెయిట్ ట్రైనింగ్ తీసుకోవచ్చు.
►ALSO READ | అమ్మాయిలు ఆఫీసుల్లో ఎలా మాట్లాడాలంటే.. ఆ మాటలే మిమ్మల్ని గెలిపించాలి.. సారీలు ఎక్కువ చెప్పొద్దు..!
నలభైలో చేస్తున్నారా?
బాడీ బిల్డింగ్ పై యువతే కాదు.. పెద్దవాళ్లకూ ఇంట్రెస్ట్ ఉంటుంది. ఏజ్ కూడా బాడీపై ఎఫెక్ట్ చూపుతుంది. కాబట్టి నలభైలోకి అడుగుపెట్టిన తర్వాత హెవీ వర్కవుట్స్‌కు దూరంగా ఉండాలి. నలభైలో కూడా వర్కవుట్స్ చేసి కొంతమంది అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ పర్కవుట్స్ చేయాల్సి వస్తే డాక్టర్లను సంప్రదించాలి.
మహిళలు బరువులు ఎత్తితే..
మజిల్స్ కోసం ఎత్తయిన బరువులు ఎత్తుతుంటారు. మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లకు మజిల్ పవర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వెయిట్ ట్రైనింగ్ చేసేటప్పుడు కచ్చితంగా ఎక్స్ పర్ట్ సలహా తీసుకోవాలి.
యోగాతో కొంచెమే..
చాలామంది బరువు తగ్గడానికి యోగా చేస్తారు. యోగాతో బరువు తగ్గడం అనేది దాదాపు అసాధ్యమే. యోగా చేయడం వల్ల ఇతర ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి. గుండె బాగా పనిచేయడం, బాడీ ఫ్లెక్సిబుల్ గా మారడం, మైండ్ కంట్రోల్ లో ఉండటం వంటి బెనిఫిట్స్ మాత్రమే ఉంటాయి
ఫీలింగ్ తో నో యూజ్...
ఒక అరగంటసేపు రన్నింగ్ చేశామనో... అదేపనిగా జిమ్ చేశామనో... ఈరోజు ఎక్కువగా వర్కవుట్స్ చేసినట్లు ఫీలవుతుంటారు చాలామంది. ఫీలింగ్ తో బరువు తగ్గరనేది ఎక్స్ పర్ట్ మాట.
-వెలుగు,లైఫ్-