మగాళ్ల బతుకు బస్టాండ్ : తాగినా కొడతారు.. తాగకపోయినా మొగుళ్లును కొడుతున్న పెళ్లాలు

మగాళ్ల బతుకు బస్టాండ్ : తాగినా కొడతారు.. తాగకపోయినా మొగుళ్లును కొడుతున్న పెళ్లాలు

దేశంలో భర్తలపై దాడులు పెరుగుతున్నాయి. భార్యల చేతిలో తన్నులు తింటున్న భర్తల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. వివిధ కారణాలతో మహిళలు తమ భర్తలపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని బయో సోషల్ స్టడీస్ అనే రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. 

భర్తలను కొడుతున్న భార్యల ప్రవర్తన, తన్నులు తింటున్న భర్తల ఎడ్యుకేషన్‌‌, తాగుడు అలవాటు.. తదితర అంశాలపై కూడా ఈ రీసెర్చ్‌‌లో పేర్కొన్నారు. భర్త రెగ్యులర్‌‌‌‌గా ఆల్కహాల్ తాగి ఇబ్బందులకు గురి చేస్తుండడం వల్లే కొట్టాల్సి వస్తున్నదని 18.4 శాతం మంది మహిళలు తెలిపారు. అప్పుడప్పుడు తాగుతాడని, తాగినప్పుడు గొడవ చేస్తాడని, ఆ సమయంలో కొట్టాల్సి వస్తుందని 6.5 శాతం మంది భార్యలు వెల్లడించారు. భర్త తనను కొట్టడంతో, తాను రివర్స్‌‌లో కొట్టానని 10.9 శాతం మంది తెలిపారు. భర్త కొట్టకపోయినా, ఇతర కారణాలతో తాము కొట్టాల్సి వచ్చిందని 6.1 శాతం మంది మహిళలు వెల్లడించారు.

తన్నులు తింటున్న వారిలో తాగుబోతులు, నిరక్షరాస్యులు ఎక్కువగా ఉంటున్నారని పేర్కొంది. ఇండియాలో హస్బండ్స్‌‌పై జరుగుతున్న డొమెస్టిక్ వయలెన్స్‌‌పై ఈ సంస్థ చేసిన రీసెర్చ్‌‌ను, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ పబ్లిష్ చేసింది. ఇండియాలో భర్తలపై దాడులు 15 ఏండ్లలో దాదాపు ఐదింతలు పెరిగినట్టు ఈ రీసెర్చ్‌‌లో గుర్తించారు. ప్రతి వెయ్యి మంది మహిళల్లో 36 మంది భర్తలపై చేయి చేసుకుంటున్నారని తెలిపింది. ఈ సంఖ్య ఇంకా ఎక్కువయ్యే అవకాశం ఉందని రీసెర్చర్లు అభిప్రాయపడ్డారు