యూత్‌‌‌‌‌‌‌‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌కు నచ్చేలా ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ: ధీరజ్ మొగిలినేని

యూత్‌‌‌‌‌‌‌‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌కు నచ్చేలా ‘కపుల్ ఫ్రెండ్లీ’ మూవీ: ధీరజ్ మొగిలినేని

యూత్‌‌‌‌‌‌‌‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌కు నచ్చేలా  ‘కపుల్ ఫ్రెండ్లీ’  సినిమా ఉంటుంది అని ఈ సినిమాను రిలీజ్ చేస్తున్న - డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని అన్నారు.  సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వంలో యూవీ కాన్సెప్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.  వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14న తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదలవుతోంది.  ఈ సందర్భంగా  తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్న  ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ..  ‘పదిహేను  రోజుల  క్రితం  ఈ  సినిమా చూశా.  బాగా నచ్చింది. 

యూవీ క్రియేషన్స్  ప్రమోద్ అన్నకు,  వంశీ అన్నకు కాల్ చేసి ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేయాలని అనుకుంటున్నా అని అడిగాను.  వారు ఓకే చెప్పడంతో  ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశాను. మనసుకు నచ్చిన సినిమాలనే   డిస్ట్రిబ్యూట్ చేస్తా.  ఈ చిత్రం కూడా అలాంటిదే.  ఇది చెన్నై బ్యాక్ డ్రాప్‌‌‌‌‌‌‌‌లో  సాగే మంచి లవ్ స్టోరీ.  టైటిల్ చూసి ఇదేదో  యూత్ చూడాల్సిన సినిమా అనుకుంటున్నారు. అది నిజం కాదు. ఇందులో  ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. శివ, మిత్ర అనే రెండు క్యారెక్టర్స్ జర్నీ చూస్తారు.  

లివ్ ఇన్ రిలేషన్ షిప్ గురించి కేవలం 15 నిమిషాలు మాత్రమే సీన్స్ ఉంటాయి. మిగతా అంతా మిత్ర, శివ అనే జంట ఒకరికొకరు పరిచయం అయ్యాక వారి జీవితాలు ఎలా మారాయి  అనేది కథ.  శివ పాత్రలో సంతోష్ శోభన్ పెర్ఫార్మెన్స్ అందరికీ  నచ్చుతుంది. తనలాంటి  యంగ్ హీరోలకు సక్సెస్ వస్తే వాళ్లు మరిన్ని మూవీస్ చేస్తారు.  ఇక - ప్రస్తుతం మా బ్యానర్‌‌లో ‘చెన్నై లవ్ స్టోరీ’ షూటింగ్ జరుగుతోంది. సంతోష్  బ్రదర్ సంగీత్ శోభన్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. అలాగే చిన్న పిల్లలతో ఓ చిల్డ్రన్ మూవీ చేస్తున్నాం.  కొందరు స్టార్ హీరోలతో స్క్రిప్ట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఒక స్టార్ తో మా సంస్థలో మూవీ అనౌన్స్ చేస్తాం’ అని చెప్పారు.