పాలసీ ఎంపిక కోసం బీమా కవచ్

పాలసీ ఎంపిక కోసం బీమా కవచ్

హైదరాబాద్​, వెలుగు:   లార్డ్స్ మార్క్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్  జీవిత బీమా, ఆరోగ్య బీమా,  సాధారణ బీమా పాలసీలను అందించే డిజిటల్ ప్లాట్‌‌‌‌ఫారమ్ ‘‘బీమాకవచ్’’ను విడుదల చేసింది. దీనిద్వారా బీమా నిపుణులు కస్టమర్లకు అవసరమైన పాలసీలను సూచిస్తారు.   

పాలసీల అమ్మకాలు, కన్సల్టెన్సీ, కౌన్సెలింగ్,  సమర్థవంతమైన క్లెయిమ్ సెటిల్‌‌‌‌మెంట్‌‌‌‌ వంటి సేవలు దీనిలో ఉంటాయని  లార్డ్స్ మార్క్ ఇన్సూరెన్స్ తెలిపింది.