
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తండ్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బియన్ రెడ్డికి చెందిన అశోక్ అనే వ్యక్తి ముగ్గురు పిల్లలను కారులో మార్నింగ్ వాక్ కు తీసుకొచ్చి వేగంగా ఇనాంగూడ చెరువులోకి దూసుకెళ్లి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో కారు చెరువులో మునిగిపోయింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే తాళ్లు, ట్యూబులతో కారుతో సహా నలుగురిని ఒడ్డుకు చేర్చారు. ముగ్గురు పిల్లలు తండ్రి ప్రాణాలతో బయటపడ్డారు.
ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబాన్ని అబ్దుల్లాపూర్ మెట్ పీఎస్ కు తీసుకెళ్లారు. ఆత్మహత్యకు గల కారణాలపై విచారించారు. అయితే కుటుంబ, ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. భార్యాభర్తల మధ్య కొద్ది రోజులుగా గొడవలు జరుగుతున్నాయని ఈ క్రమంలో అతను పిల్లలతో కలిసి ఆత్మహత్య యత్నం చేశాడని పోలీసులు వెల్లడించారు.