బీఆర్ఎస్ పార్టీ మీటింగ్‪లో గొడవ స్టేజ్ పైనే ఒకరినొకరు తిట్టుకున్న నాయకులు

బీఆర్ఎస్ పార్టీ మీటింగ్‪లో గొడవ స్టేజ్ పైనే ఒకరినొకరు తిట్టుకున్న నాయకులు

హైదరాబాద్ తెలంగాణ భవన్ లో వేదికగా బీఆర్ఎస్ ముఖ్య నేతల మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. ఈ సమావేశం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో జరుగుతోంది. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ , పార్టీ ముఖ్య నేత రావుల శ్రీధర్ రెడ్డి మధ్య గొడవ జరిగింది. ఎమ్మెల్యే మాగంటి మాట్లాడుతుండగా... శ్రీధర్ రెడ్డి అడ్డుకున్నారు. దీంతో తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. అసలు మీటింగ్ కు నిన్ను ఎవడు పిలిచాడని శ్రీధర్ రెడ్డి పై మండిపడ్డారు. దీనికి శ్రీధర్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. వివాదం పెరుగుతుండడంతో  ఎమ్మెల్యే తలసాని జోక్యం చేసుకొని ఇద్దరికి సర్ది చెప్పినట్టు తెలుస్తోంది.

ALSO READ | ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేదు.. ఎంత ఒత్తిడి తెచ్చినా పార్టీ మారను: ఎర్రబెల్లి