ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం లేదు.. ఎంత ఒత్తిడి తెచ్చినా పార్టీ మారను: ఎర్రబెల్లి

ఫోన్  ట్యాపింగ్ తో సంబంధం లేదు.. ఎంత ఒత్తిడి తెచ్చినా  పార్టీ మారను: ఎర్రబెల్లి

తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.  ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనపై ఎంత ఒత్తిడి తెచ్చినా  పార్టీ మారే ప్రసక్తి లేదన్నారు.  ప్రణీత్ రావు అమ్మమ్మది మా ఊరే .. ప్రణీత్ రావు  నాకు  భందువు కాదు .. ఒక్కటే  సామాజిక వర్గం అని అన్నారు ఎర్రబెల్లి. తన  అలాగే చరణ్ చౌదరిపై అనేక చీటింగ్ కేసులున్నట్లు చెప్పారు. అతను బీజేపీలో ఉండి భూ కబ్జాలు చేస్తున్నాడని పార్టీ  సస్పెండ్ చేసిందన్నారు.

30 ఏళ్లకు పైగా ఎమ్మెల్యేగా ఉన్నా..  వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు మంత్రి పదవి ఇస్తామన్నా పార్టీ మారలేదన్నారు ఎర్రబెల్లి.  ఓటుకు నోటు కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేయాలని.. తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తన దగ్గరికి ప్రజలు ఎవరు వచ్చినా విచారణ చేయాలని అధికారులకు చెప్పానన్నారు.