
హైదరాబాద్ లో మరో అగ్నిప్రమాదం జరిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రమంజిల్ లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా భవనంలోని ఐదు, ఆరు అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. ఆరు అంతస్తుల్లో ఓ కుటుంబం చిక్కుకుపోయింది.
వెంటనే సమాచారం అందించిన ఫైర్ సిబ్బంది ఆరగంటైనా రాకపోవడంతో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పంజాగుట్ట ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ అందులోకి వెళ్లి వారందరిని రక్షించాడు. దీంతో కానిస్టేబుల్ చేసిన సహసానికి ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.
అనంతరం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని పోలీసులు తెలిపారు.