నల్లమల అడవిలో చెలరేగిన మంటలు

నల్లమల అడవిలో చెలరేగిన మంటలు

లింగాల, వెలుగు: నల్లమల అటవీ ప్రాంతంలోని అప్పాయిపల్లి బీట్ పరిధిలో మర్లపాయ సమీపంలో మంగళవారం మంటలు చెలరేగాయి. ఇప్ప పువ్వు సేకరణకు వెళ్ళిన వారు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాపించినట్లు లింగాల ఎఫ్ఆర్వో వీరేశ్​ తెలిపారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్​ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఐదు హెక్టార్లలో నష్టం వాటిల్లినట్లు తెలిపారు. వేసవిలో మేకలు, పశువుల కాపరులకు అడవిలోకి ప్రవేశం లేదన్నారు. అడవిలో నిప్పు పెట్టవద్దని, ఎవరైనా కావాలని నిప్పు పెడితే వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.