సిలిండర్ పేలి ఒకరు మృతి, మరో ఇద్దరికి గాయాలు

 సిలిండర్ పేలి ఒకరు మృతి, మరో ఇద్దరికి గాయాలు

రంగారెడ్డి జిల్లా  శేరిలింగంపల్లి రైల్ విహార్ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో అంబాల నాయక్ అనే వ్యక్తి   మృతి చెందగా.... మరో ఇద్దరు గాయపడ్డారు. సిలిండర్ పేలటంతో ఇంటి పైకప్పు కూలిపోయింది. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సిలిండర్ పేలిన గదిలో నలుగురు వ్యక్తులు ఉంటున్నారని చందానగర్ సబ్ ఇన్స్ పెక్టర్ నాగేశ్వరావు తెలిపారు. మృతుడితోపాటు గాయపడిన వారంతా రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించామని చెప్పారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు.