పార్క్ హయత్ హోటల్ లో గ్రాండ్ గా ఫ్యాషన్ షో

పార్క్ హయత్ హోటల్ లో  గ్రాండ్ గా ఫ్యాషన్ షో

పంజాగుట్ట,  వెలుగు:  గ్రాండ్ నైట్ ఎలియనర్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షో  జూబ్లీహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఆదివారం రాత్రి  అట్టహాసంగా జరిగింది. ఫేమస్ డిజైనర్ శ్రవణ్ కుమార్ డిజైన్ చేసిన దుస్తుల్లో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి( అర్జున అవార్డు గ్రహీత)  సిక్కి రెడ్డి, మోడల్స్ మెరిసిపోతూ.. ర్యాంప్ వాక్ చేసి విజిటర్స్ ను ఆకర్షించారు. ఈ ష్యాషన్ షో  ద్వారా వచ్చే ఆదాయంతో ఎనిమిది ప్రభుత్వ స్కూళ్లలోని విద్యార్థినులకు సానిటరీ న్యాప్‌‌‌‌కిన్స్‌‌‌‌ ను అందించనున్నట్టు షో నిర్వాహకులు తెలిపారు. ప్రముఖ యాక్టర్, యాక్టివిస్ట్‌‌‌‌ సబితా రెడ్డి, డాక్టర్ మంజుల అనగాని, లీల జోసెఫ్‌‌‌‌, ఎఫ్‌‌‌‌ఐసీసీఐ చైర్‌‌‌‌‌‌‌‌ పర్సన్‌‌‌‌ రీతు షా తదితరులు పాల్గొన్నారు.