
ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ నాథన్ లియాన్ 37 ఏళ్ళ వయసులో కూడా టెస్ట్ క్రికెట్ లో సత్తా చాటుతూ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మ్యాచ్ ఎక్కడ జరిగినా కూడా ఆసీస్ తుది జట్టులో లియాన్ ఉండాల్సిందే. షేన్ వార్న్ రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి 14 ఏళ్లుగా కంగారూల జట్టు స్పిన్ బాధ్యతలను ఒంటి చేత్తో మోస్తున్నాడు. కెరీర్ లో 139 టెస్టులు.. 562 వికెట్లు.. ఎన్నో మ్యాచ్ విన్నింగ్ ఘనతలు.. ఒక ఆటగాడిగా ఇంతకన్నా ఏం కావాలి. ఇంత గొప్ప కెరీర్ లో లియాన్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఆశ్చర్యకరంగా లియాన్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లో ఒక్క బాల్ కూడా నో బాల్ వేయలేదు. ఇప్పటివరకు ఈ ఆసీస్ స్పిన్నర్ 34,504 డెలివరీస్ వేశాడు. కానీ ఒక్కసారి కూడా ఫ్రంట్-ఫుట్ నో-బాల్ వేయకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆస్ట్రేలియన్ టెస్ట్ చరిత్రలో నో-బాల్ లేకుండా 100 కి పైగా టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన తొలి బౌలర్ ఈ ఆఫ్ స్పిన్నర్. తన కెరీర్ లో 139 టెస్టుల్లో 550 పైగా వికెట్లు తీసిన లియాన్.. తన బౌలింగ్ డిసిప్లిన్ తో ఆకట్టుకుంటున్నాడు. ఒక స్పిన్నర్ 30 వేలకు పైగా బంతులు విసిరినా నో బాల్ వేయకపోవడం లియాన్ కే చెందింది. వెస్టిండీస్ జట్టులో అత్యుత్తమ స్పిన్ బౌలర్లలో ఒకడైన లాన్స్ గిబ్స్ సైతం టెస్టుల్లో ఒక్క నో బాల్ వేయలేదు.
లియాన్ టెస్ట్ కెరీర్ విషయానికి వస్తే 139 టెస్టుల్లో 562 వికెట్లు పడగొట్టాడు. షేన్ వార్న్ (708), ఫాస్ట్ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ (563) తర్వాత ఆస్ట్రేలియన్ బౌలర్ల జాబితాలో మూడవ స్థానంలో నిలిచాడు. లియాన్ మరో 8 వికెట్లు పడగొడితే మెక్‌గ్రాత్ (563) ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరతాడు. ఓవరాల్ గా లియాన్ టెస్టు క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవలే వెస్టిండీస్ తో జరిగిన నాలుగో టెస్టులో లియాన్ కు 12 ఏళ్ళ తర్వాత ఆసీస్ తుది జట్టులో స్థానం దక్కలేదు. ఈ ఆఫ్ స్పిన్నర్ స్థానంలో స్కాట్ బోలాండ్ కు ప్లేయింగ్ 11 లో చోటు దక్కింది.
ALSO READ : ENG vs IND: రిషబ్ పంత్‌ను గుర్తు చేసిందిగా.. వన్ హ్యాండెడ్ సిక్సర్‌తో దీప్తి స్టన్నింగ్ షాట్
— Troll cricket unlimitedd (@TUnlimitedd) July 16, 2025