
నందమూరి బాలకృష్ణ ( Balakrishna) , బోయపాటు శ్రీను ( Boyapati Sreenu ) కాంబోలో వస్తున్న ఆధ్యాత్మిక యాక్షన్ చిత్రం 'అఖండ 2; తాండవం' ( Akhanda 2 Thandavam ) . ఇప్పటికే దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ కోసం బాలయ్య అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. అయితే ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'అఖండ 2' విడుదల వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
తొలుత ఈ మూవీని సెప్టెంబర్ 27, 2025న విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావించారు. డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పుడు డిసెంబర్ కు వాయిదా పడే సూచనలు ఉన్నాయని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే డిసెంబర్ 5న విడుదల కానున్న ప్రభాస్ ( Prabhas ) 'రాజా సాబ్' ( Raja Saab) తో బాక్సాఫీస్ వద్ద అఖండ2 తలపడాల్సి ఉంది. 'అఖండ' పార్ట్ 1( Akhanda ) కూడా డిసెంబర్ లోనే విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సీక్వెల్ కూడా డిసెంబర్ లోనే విడుదల చేస్తే రికార్డులు సృష్టించడం ఖాయమని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. అయితే అయితే దీనిపై నిర్మాణ బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read:- బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో అనుపమ ప్రత్యేక పూజలు.. ఫొటోలు వైరల్
గతంలో బాలయ్య, బోయ్యపాటి కాంబినేషన్ లో వచ్చిన 'సింహ', 'లెజెండ్' వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. ఆ తర్వాత వచ్చిన 'అఖండ' కూడా ఊహించని విజయాన్ని సాధించింది. బాలకృష్ణ కెరీర్ లోనే ఒక మైలు రాయిగా నిలిచింది. ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో నాలుగోసారి కలిసి పనిచేస్తుండటంతో 'అఖండ 2'పై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ అభిమానులను ఎంతో ఆకట్టుకుంది. బాలకృష్ణను గతంలో ఎప్పుడూ చూడని రీఫ్రెష్డ్, ఇంటెన్సివ్ లుక్ లో చూపించారు.
ఈ 'అఖండ 2: తాండవం' ప్రాజెక్టు పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. దీని కోసం మూవీ టీం పక్క ప్రణాళితో ముందుకెళ్తుంది. దీనిలో భాగంగా ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్స్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొంత పెండింగ్ ఉంది. ఇవన్నీ పూర్తి కావాలంటే కొంత సమయం కేటాయించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేయాలన్న యోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ తో కూడిన ' అఖండ 2; తాండవం' మూవీని14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా సంయుక్త మీనన్, ప్రతి నాయకుడి పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నారు. సంగీతాన్ని ఎస్. థమన్ అందిస్తున్నారు.