వీరజవాన్ శివగంగాధర్‌కు ఘనంగా అంతిమ వీడ్కోలు

వీరజవాన్ శివగంగాధర్‌కు ఘనంగా అంతిమ వీడ్కోలు

 

కర్నూలు: చైనా సరిహద్దు ప్రాంతంలో ప్రాణాలర్పించిన వీర జవాన్ పోలుకంటి శివ గంగాధర్ కు సైనిక లాంఛనాలతో ఘనంగా అంతిమ వీడ్కోలు పలికారు. స్వగ్రామం చేరుకున్న ఈయన మృతదేహాన్ని కడసారా చూసేందుకు పరిసర గ్రామాల నుండి భారీగా జనం తరలివచ్చి కంటతడిపెట్టుకున్నారు. జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్,జిల్లా ఎస్పీ డా.కె. ఫకీరప్ప ఇతర ఉన్నతాధికారులంతా

సోమవారం కొత్తపల్లి మండలం గువ్వలకుంట్ల గ్రామంలో మృతి చెందిన శివ గంగాధర్ నివాస గృహం వద్ద నివాళులర్పించారు. చైనా సరిహద్దు ప్రాంతంలో సిపాయి నెం. 17035927Y విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలుకంటి శివ గంగాధర్ భౌతికదేహాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆర్మీ జవాన్లు అంతిమ యాత్ర ఘనంగా నిర్వహించారు. అశ్రు నివాళులతో గ్రామస్థులు కన్నీటి వీడ్కోలు పలికారు.  కర్నూలు ఆర్డిఓ వెంకటేసు, జిల్లా సైనిక సంక్షేమ అధికారి రాచయ్య, ఆత్మకూరు డిఎస్పీ శృతి, ఆర్మీ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

ఇతడు ఇన్నోవేటివ్ రైతుగా​ ఎలా మారాడంటే..

మొక్కకు ఈ బాక్సు పెడితే.. నెలకు రెండు సార్లు నీళ్లు పోస్తే చాలు

చార్మినార్ ను డేంజర్లో పడేస్తున్నరు!

నాటినోళ్ల పేరే.. మొక్కకు పెడుతున్నరు