మూడేండ్ల చిన్నారి చేతిలో పేలిన గన్

మూడేండ్ల చిన్నారి చేతిలో పేలిన గన్

న్యూఢిల్లీ: మూండేండ్ల చిన్నారి గన్​తో ఆడుకుంటూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కింది. దీంతో బులెట్​ ఏడాది వయసున్న చెల్లి తలలో నుంచి దూసుకెళ్లింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో మంగళవారం ఈ ఘటన జరిగింది. శాన్ డియాగో కౌంటీలో ఫాల్ బ్రూక్​లో మూడేండ్ల చిన్నారి తన ఏడాది వయసున్న చెల్లితో కలిసి ఇంట్లో గన్​తో ఆడుకుంటోంది. ఈ క్రమంలోనే ట్రిగ్గర్ నొక్కింది. దీంతో ఎదురుగా ఉన్న పాప తలలోకి బులెట్ దూసుకెళ్లింది. ఏం జరిగిందో అర్థం కాని ఆ మూడేండ్ల చిన్నారి తన చెల్లి రక్తపు మడుగులో పడి ఉండటం చూసి ఎమర్జెన్సీకి కాల్ చేసింది. స్పాట్​కు

చేరుకున్న పోలీసులు పాపను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ చిన్నారి చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ చిన్నారులిద్దరినీ ఇంట్లో వదిలి పెద్దవాళ్లంతా ఎక్కడికెళ్లారు? పిల్లల చేతిలోకి గన్ ఎలా వచ్చిందనే కోణంలో ఇన్వెస్టిగేట్ చేస్తున్నట్లు వెల్లడించారు.