భూమికి దగ్గరగా భారీ ఆస్టరాయిడ్

భూమికి దగ్గరగా భారీ ఆస్టరాయిడ్
  • 21న భూమికి దగ్గరగా భారీ ఆస్టరాయిడ్
  • దూసుకుపోనున్న ‘2001ఎఫ్ వో32’ గ్రహశకలం

వాషింగ్టన్: దుబాయిలోని బుర్జ్ ఖలీఫా కన్నా డబుల్ హైట్.. కిలోమీటరు వెడల్పు.. 1.7 కిలోమీటర్ల ఎత్తు ఉన్న ఓ భారీ ఆస్టరాయిడ్ యమా స్పీడ్ తో మన భూగోళం వైపు దూసుకొస్తోంది! అది ఈ నెల 21న మన భూమికి దగ్గరి నుంచే గంటకు1 లక్ష 23 వేల కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకెళ్లనుందని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా గురువారం వెల్లడించింది. ‘2001 ఎఫ్ వో32’ అనే ఆ గ్రహశకలం భూమికి 20 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణిస్తుందని, ప్రస్తుతానికి దీని నుంచి ముప్పేమీ లేదని ప్రకటించింది. సదర్న్ హెమీస్పియర్, లో నార్తర్న్ ఆల్టిట్యూట్ ఏరియాల నుంచి దీనిని 21వ తేదీన సాధారణ టెలిస్కోపులతో కూడా చూసేందుకు అవకాశం ఉంటుందని నాసా తెలిపింది. 
 

భవిష్యత్తులో డేంజర్?
‘2001 ఎఫ్ వో32’ ఆస్టరాయిడ్​ను నాసా సైంటిస్టులు 2001 మార్చిలో కనుగొన్నారు. భూమికి దగ్గరగా వచ్చే ‘నియర్ అర్త్ ఆస్టరాయిడ్స్’ లిస్టులో దీనిని చేర్చారు. భూమికి చంద్రుడికి మధ్య దాదాపు 4 లక్షల కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ ఆస్టరాయిడ్ ఇంతకంటే ఐదు రెట్ల దూరంలో వెళ్తోంది. అయితే భూమికి 40 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఆర్బిట్లలో తిరిగే ఆస్టరాయిడ్లు భవిష్యత్తులో భూమిని ఢీకొట్టే చాన్స్ ఎక్కువగా ఉంటుందని సైంటిస్టుల అంచనా. ‘2001 ఎఫ్ వో32’ ఆస్టరాయిడ్ ప్రస్తుతం భూమికి 20 లక్షల కి.మీ. దూరంలోని ఆర్బిట్ లోనే తిరుగుతున్నందున భవిష్యత్తులో.. అంటే ఒక వందేళ్ల తర్వాత ఇది భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉండొచ్చని చెప్తున్నారు.