భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి..

 భారీ ఎన్ కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి..

మావోయిస్టులకు ఊహించిన రీతిలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దుల్లోని రేపన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న కోలా మరక అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతి చెందారు.

 మృతి చెందిన నలుగురిపై రూ. 36 లక్షల రివార్డు ఉంది. 60 మంది కమాండోలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో డీవీసీ సభ్యులు వర్గీష్, మంగాతు, ప్లాటూన్ సభ్యులు కురసం రాజు, వెంకటేష్ మృతి చెందాడు. ఘటనా స్థలం నుంచి ఒక AK47, ఒక కార్బైన్, రెండు పిస్టల్స్‌తో సహా పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు భద్రతా బలగాలు.