సోనియాగాంధీ కోవిడ్ నుంచి కోలుకోగానే CWC సమావేశం

సోనియాగాంధీ కోవిడ్ నుంచి కోలుకోగానే CWC సమావేశం

ఈనెల 28న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనుంది. సోనియాగాంధీ కోవిడ్ నుంచి కోలుకోగానే CWC సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో పార్టీ జనరల్ సెక్రటరీలు, పలు రాష్ట్రాల ఇన్ఛార్జ్ లు హాజరుకానున్నారు. కాంగ్రెస్ సంస్థాగత వ్యహారాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఇందులో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఛత్తీస్ఘడ్ ముఖ్యమంత్రి భూపేశ్ భాగేల్ పాల్గొననున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తర్ప్రదేశ్, ఢిల్లీ పీసీసీ అధ్యక్షులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో యూపీ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ హాజరవుతారని తెలుస్తోంది.

దేశంలో పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు వ్యతిరేకంగా ఆగస్టు 28న రాంలీలా మైదానంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించనున్న భారీ ర్యాలీపై చర్చించే అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాల నుంచి పార్టీ ప్రతినిధులు  పాల్గొని, ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లు..భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేయనున్నారు. 

సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై కూడా చర్చించనున్నారు. అక్టోబర్ 2 నుంచి యాత్రను ప్రారంభించాలని ముందుగా నిర్ణయం తీసుకున్నా.. ఆ తర్వాత సెప్టెంబర్ 7 కు మార్చారు. ఇక సెప్టెంబర్ మొదటి వారంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. అనంతరం ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ను ఖరారు చేయనున్నారు.