గచ్చిబౌలి, వెలుగు: దేవుడి ముందు వెలిగించిన దీపం ప్రమాదవశాత్తు సోఫాపై పడటంతో మంటలు చెలరేగాయి. గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ సమీపంలో మేఘా ఏడీఫైస్ అపార్ట్మెంట్ నాలుగో ఫ్లోర్లోని ఓ ఇంట్లో ఆదివారం దేవుడి ముందు దీపం వెలిగించి బయటకు వెళ్లారు. ప్రమాదవశాత్తు ఆ దీపం అక్కడే ఉన్న సోఫాపై పడి మంటలు చెలరేగాయి. గమనించిన పక్కింటి వారు ఫైర్ స్టేషన్, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ అధికారులు చేరుకుని మంటలు ఆర్పివేశారు.
