బుద్వేలు భూముల వేలం పాట ఆపండి : హైకోర్టులో న్యాయవాదుల సంఘం పిల్

బుద్వేలు భూముల వేలం పాట ఆపండి : హైకోర్టులో న్యాయవాదుల సంఘం పిల్

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా బుద్వేలులోని భూముల వేలం పాటను ఆపాలంటూ హైకోర్టులో న్యాయవాదుల సంఘం పిల్ దాఖలు చేసింది. తెలంగాణ హైకోర్టు నిర్మాణం కోసం బుద్వేలు భూములు కేటాయించేలా ఆదేశించాలని పిల్ దాఖలు చేసింది. బుద్వేలులో 100 ఎకరాలు హైకోర్టు నిర్మాణం కోసం కేటాయించాలని 2012 నుంచి తాము కోరుతున్నామని అసోసియేషన్ పేర్కొంది. హైకోర్టు నిర్మాణం కోసం బుద్వేల్‌లో భూకేటాయింపునకు 2012లోనే అప్పటి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని బార్ అసోసియేషన్  చెప్పింది. ఈ విషయంపై హైకోర్టు బార్ అసోసియేషన్, రిజిస్ట్రార్ జనరల్ అనేక లేఖలు రాసినట్లు పిల్‌లో వెల్లడించింది. ఆగస్టు 10వ తేదీన హెచ్‌ఎండీఏ వేలం పాట ఆపాలని హైకోర్టును అడ్వకేట్స్ అసోసియేషన్ కోరింది.