కేటీఆర్​ బర్త్​డే సందర్భంగా రూపాయికే లీటరు పెట్రోల్

V6 Velugu Posted on Jul 25, 2021

  • రూపాయికే లీటర్ ​పెట్రోల్​ అని చేతులెత్తేసిన్రు
  • టీఆర్ఎస్​ లీడర్​ తీరుపై జనం ఆగ్రహం

అశ్వారావుపేట, వెలుగు: కేటీఆర్​ బర్త్​డే సందర్భంగా టీఆర్ఎస్​ యువ నాయకుడు ఒకరు రూపాయికే లీటరు పెట్రోల్ ​ఇస్తామని ప్రకటించాడు. విషయం తెలిసి జనం బంకు ఎదుట క్యూ కట్టడంతో చేతులెత్తేశాడు. కేటీఆర్ బర్త్ డే సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో టీఆర్ఎస్ యువ నాయకుడు మోటూరి మోహన్ శనివారం రూపాయికే లీటర్ పెట్రోల్ అని వాట్సాప్ గ్రూపులో అనౌన్స్ చేశాడు. మెసేజ్ పెట్టిన పది నిమిషాల్లో ఆ నోటా ఈ నోటా తెలిసి జనం బంకుకు పరుగులు తీశారు. 20 మందికి పెట్రోల్ కొట్టించి హల్ చల్ చేద్దామనుకున్న ఆ లీడర్ ​జనం ఎక్కువగా రావడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉడాయించాడు. దీంతో బంకు దగ్గరకి వెళ్లిన జనం టీఆర్ఎస్ నాయకులను తిట్టుకుంటూ వెనుతిరిగారు. 

Tagged TRS, Telangana, KTR, Bhadradri Kothagudem, KTR BirthDay, petrol for one rupee, moturi mohan, ashwaraopeta

Latest Videos

Subscribe Now

More News