
సిద్దిపేట జిల్లా ములుగు మండలం ఆర్వీఎం హాస్పిటల్ లో దారుణం జరిగింది. మెదక్ పట్టణానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తి... హాస్పిటల్ 5వ ఫ్లోర్ నుంచి జారిపడి చనిపోయారు. ఊపిరితిత్తులు, కిడ్ని వ్యాధితో చికిత్స కోసం హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. అయితే ఆరోగ్యశ్రీ అనుమతులు రాలేదని పేషంట్ ని సిబ్బంది పట్టించుకోలేదని మృతుడి భార్య ఆరోపిస్తోంది. హాస్పిటల్ పై నుంచి కిందపడిన విజువల్స్ సిసీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి.