
దేశ వ్యాప్తంగా గుండెపోట్లు కలవర పెడుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా నిత్యం ఎక్కడో ఓ చోట గుండెపోటుతో మరణిస్తున్నారు. ఉన్నచోటనే క్షణాల్లోనే ప్రాణాలు విడుస్తున్న ఘటనలు ఈ మధ్య చాలానే చూస్తున్నాం.
లేటెస్ట్ గా హైదరాబాద్ లోని పెద్ద అంబర్ పేట వద్ద ఆగి ఉన్న కారులో ఓ వ్యక్తికి గుండెపోటు వచ్చింది. అటుగా వెళ్తున్న రామన్న పేట సీఐ మోతీరం గమనించి అతడికి సీపీఆర్ చేశాడు. కాసేపటికే స్పృహలోకి వచ్చిన అతడిని హాస్పత్రికి తరలించాడు సీఐ. కానీ అప్పటికే మార్గం మధ్యలో ప్రాణాలు విడిచినట్లు డాక్టర్లు చెప్పారు.