
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆర్మీ మరోసారి తమ బుద్ధిని బయట పెట్టుకుంది. జిహాదే తమ విధానమని స్పష్టం చేసింది. అంతే కాదు ఆర్మీ చీఫ్ జిహాదీ జనరల్ అని వెల్లడించింది. మీడియా సమావేశంలో ఆర్మీ అధికారులు ఈ మేరకు ఈ వ్యాఖ్యలు చేశారు. జనరల్ జియా ఉల్ హక్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే తమ అధికారిక నినాదంలో మార్పు వచ్చినట్లు చెప్పారు.
మార్గదర్శక సూత్రాలైన ఇత్తెహాద్(ఐక్యత), యాకీన్(విశ్వాసం), తంజీమ్(క్రమశిక్షణ) ల స్థానంలో ఇమాన్(విశ్వాసం), తక్వా(దైవభక్తి), జిహాద్ ఫి–సబిలిల్లా(దేవుడి పేరు మీద పోరాటం)లను చేర్చినట్లు తెలిపారు. ఇమాన్, తఖ్వా, జిహాద్ ఫి-సబిలిల్లా, అంటే విశ్వాసం, భక్తి మరియు దేవుని పేరు మీద పోరాటం అని అర్ధం, అని ఆయన అన్నారు.
ఒకవైపు కాల్పుల విరమణకు సిద్దమంటూ ప్రతిపాదన చేసిన పాకిస్తాన్ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే ఉల్లంఘనకు పాల్పడింది. తాజాగా ఇరు దేశాలకు చెందిన మిలిటరీ ఆపరేషన్ డీజీల మధ్య చర్చలు జరగాల్సి ఉన్న రోజునే అక్కడి ఆర్మీ అధికారులు మరోసారి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.