ఒక సీసీ కెమెరా 100 మందితో సమానం :  ఏఎస్పీ చైతన్యరెడ్డి

ఒక సీసీ కెమెరా 100 మందితో సమానం :  ఏఎస్పీ చైతన్యరెడ్డి

కామారెడ్డి టౌన్, వెలుగు : ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని కామారెడ్డి ఏఎస్సీ చైతన్యరెడ్డి అన్నారు.   సోమవారం జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్​ కాలనీలోని డబుల్​ బెడ్​ రూమ్స్​ సముదాయంలో  స్థానికులు ఏర్పాటు చేసుకున్న 30 సీసీ కెమెరాలను ఏఎస్పీ ప్రారంభించి మాట్లాడారు.  

ప్రజలు  రూ. 2 లక్షలు చందాలు వేసుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం అభినందనీయమన్నారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కార్యక్రమంలో టౌన్​ సీసీ చంద్రశేఖర్​రెడ్డి,  ఎస్సై శ్రీరామ్​, సిబ్బంది కమలాకర్​రెడ్డి,  విశ్వనాథ్​,  అజర్​, సంపత్,  నర్సారెడ్డి, కాలనీ వాసులు పాల్గొన్నారు.