మిస్టరీ ఏంటీ: పద్మశ్రీ, వ్యవసాయ శాస్త్రవేత్త అయ్యప్పన్.. కావేరీ నదిలో శవంగా కనిపించాడు..!

మిస్టరీ ఏంటీ: పద్మశ్రీ, వ్యవసాయ శాస్త్రవేత్త అయ్యప్పన్.. కావేరీ నదిలో శవంగా కనిపించాడు..!

బెంగళూరు: పద్మశ్రీ అవార్డు అందుకున్న భారత శాస్త్రవేత్త కావేరి నదిలో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. ఐసీఏఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ కర్ణాటకలోని శ్రీరంగపట్న సమీపంలోని సాయి ఆశ్రమ్ పక్కన ఉన్న కావేరి నదిలో శవమై కనిపించిన ఘటన కలకలం రేపింది. భార్యతో కలిసి మైసూర్లో ఉంటున్న డాక్టర్ అయ్యప్పన్ మే 7న కనిపించకుండాపోయారు.

ఆదివారం సాయంత్రం  కావేరి నదిలో ఆయన మృతదేహం పోలీసులకు లభ్యమైంది. ఆయన స్కూటర్ కూడా కావేరి నది ఒడ్డున కనిపించింది. శ్రీరంగ పట్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డాక్టర్ అయ్యప్పన్ మరణానికి కారణం ఆత్మహత్యగా పోలీసులు భావిస్తున్నారు.

ప్రిన్సిపాల్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియాగా అయ్యప్పన్కు గుర్తింపు దక్కింది. ‘‘ఆక్వా కల్చర్ రెవల్యూషన్’’లో ఆయనది కీలక పాత్ర. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ను 2022లో పద్మశ్రీకి ఎంపిక చేసింది. 1955, డిసెంబర్ 10న కర్ణాటకలోని చామరాజనగర్ లో ఆయన జన్మించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు. నేషనల్ అక్రిడటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్, NABLకు ఆయన సేవలందించారు. ఇంఫాల్లోని సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా కూడా ఆయన పనిచేశారు.