Health Tips: రోజూ టీ స్పూన్ గుమ్మడి గింజలు తింటే.. మీ బాడీలో జరిగే మార్పులు ఇవే..!

Health Tips: రోజూ టీ స్పూన్ గుమ్మడి గింజలు తింటే.. మీ బాడీలో జరిగే మార్పులు ఇవే..!

ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ మయం. ఇంట్లో తినటం కంటే బయట తినటమే ప్రస్తుత ట్రెండ్. ఇలా ఆర్డర్ పెడితే అలా వచ్చేస్తుంటుంది. టేస్టీ కోసం ఎన్ని రకాల ఐటమ్స్ తింటున్నా.. బాడీలో మినరల్స్, విటమిన్స్ లోపంతో ఇబ్బందులు పడుతున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరిపోతూనే ఉంది. ఫాస్ట్, జంక్ ఫుడ్ తింటే ఫ్యాట్ పెరిగిపోవడం, హెల్త్ పాడవ్వటం తప్ప లాభాలు లేవని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అందుబాటులో ఉండే నట్స్, సీడ్స్ తో న్యూట్రిషన్ డెఫిషియెన్సీ లేకుండా కాపాడుకోవచ్చు. అలాంటి సీడ్స్ లో ముఖ్యమైనవి.. పంక్ కిన్ సీడ్స్-గుమ్మడి గింజలు.

గుమ్మడి గింజలతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సీడ్స్ లో మెగ్నీషియం, జింక్, ఐరన్, ప్రోటీన్, హెల్తీ ఫ్యాట్స్ మొదలైన న్యూట్రిషన్స్ ఉండటంతో సూపర్ ఫుడ్ సీడ్స్ గా పిలుస్తుంటారు. అలాంటి సూపర్ సీడ్స్ రోజూ ఉదయాన్నే ఒక స్పూన్ తింటే బాడీలో జరిగే మార్పులు అన్నీ ఇన్నీ కాదని అంటున్నారు వైద్యులు. అవేంటో తెలుసుకుందాం..!

1. మంచి నిద్ర కోసం:

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం.. పంప్కిన్ సీడ్స్ లో ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్స్ ఉంటాయి.  మన బాడీ వీటిని సెరటోనిన్ (మూడ్ బూస్టర్), మెలటోనిన్ (స్లీప్ బూస్టర్) అనే హార్మోన్లుగా కన్వర్ట్ చేస్తుంది. ఈ హార్మోన్లు మూడ్ బాగుండటానికి, మంచి నిద్ర పట్టడానికి తోడ్పడుతాయి. గుమ్మడి గింజలు తినటం వలన డిప్రెషన్ తగ్గి మంచి నిద్ర కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. అంతే కాకుండా గాయాలు తొందరగా తగ్గటానికి, బాడీలో బ్యాక్టీరియా, వైరస్ లాంటి వాటితో పోరాడటానికి కావాల్సిన శక్తిని  ఇస్తుంటాయి.

2. వయసును తగ్గిస్తాయి:

పిడికెడు గుమ్మడి గింజలలో 7 గ్రాముల ప్రోటీన్, 13 గ్రాముల హెల్తీ ఫ్యాట్, 37% మెగ్నీషియం, 1.7 గ్రాముల ఫైబర్ తో పాటు విటమిన్ E, కెరటోనాయిడ్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ఇవి వయసు పెరుగుతున్నట్లు కనిపించే లక్షణాలను తగ్గిస్తాయి. 

3. గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి:

ఈ సీడ్స్ లో మెగ్నీషియం అధికంగా ఉండటంతో.. బ్లడ్ ప్రెజర్ ను రెగ్యులేట్ చేయడంలో తోడ్పడుతుంది. దీంతో హార్ట్ బీట్ కూడా నిలకడగా ఉంటుంది. ఒమేగా-3, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వలన గుడ్ కొలెస్ట్రాల్ ను పెంచి బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అంతే కాకుండా స్ట్రెస్ తగ్గించి రక్తనాళాలను, గుండెను కాపాడుతాయి. 

4. బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది:

ఇందులో ఉండే మెగ్నీషియం ఇన్సులిన్ ను ప్రభావితం చేస్తుంది. దీని వలన బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. ఈ  గింజల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ స్ట్రెస్ ను తగ్గిస్తాయి. దీని వలన కూడా షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతుంటాయి. ఇందులో ఉండే ఫైబర్ ఆహారం జీర్ణమవ్వటానికి తోడ్పడుతూ.. రక్త ప్రవాహంలోకి కావాల్సినంత గ్లూకోజ్ విడుదల చేస్తుంది. 

5. రోగనిరోధక శక్తిని పెంచుతుంది:

గుమ్మడి గింజలలో ఉండే జింక్.. కణాల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతే కాకుండా ఇన్ఫెక్షన్స్ కాకుండా ఫైట్ చేసేందుకు తోడ్పడుతుంది. అలాగే జలుబును త్వరగ తగ్గేందుకు సహకరిస్తుంది. విటమిన్ -E కణాలు డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది.