
సినీ నటుడు నాగార్జున ఖైరతబాద్ ఆర్టిఏ ఆఫీస్ లో సందడి చేశారు . తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ కోసం వచ్చిన నాగార్జున ఫోటో దిగి సంతకం చేశారు. ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జునతో పలువురు సిబ్బంది సెల్ఫీలు, ఫోటోలు తీసుకున్నారు. అనంతరం నాగార్జున తన కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
నాగార్జున రాకతో ఆర్టీఏ ఆఫీస్ కు వచ్చిన అభిమానులు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. కాసేపు అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు పోలీసులు.
నాగార్జున చివరిసారిగా 2024లో వచ్చిన నా సామి రంగ చిత్రంలో నటించారు. ఇది కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా. సోలో హీరోగా నాగార్జున హిట్ కొట్టి చాలా రోజులవుతోంది. నాగార్జున నెక్ట్స్ తన వందో సినిమాకు రెడీ అవుతున్నారంట. ఈ సినిమా గురించి స్క్రిప్ల్ వర్క్ అవుతుందని సమాచారం.