
నిజామాబాద్, వెలుగు : న్యాయ చట్టాలపై అవగాహన కల్పించడంతో పాటు అట్టడుగు వర్గాలకు న్యాయ సేవలు అందేలా పని చేస్తున్నామని జిల్లా లీగల్ అథారిటీ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఉదయభాస్కర్ అన్నారు. సోమవారం లీగల్ అథారిటీ ఆధ్వర్యంలో మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ విలేజ్‌లోని కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
భార్యభర్తలు, అన్నదమ్ముల గొడవలు, సివిల్ కేసులు లోక్ అదాలత్‌లో పరిష్కరించుకునే వీలుందన్నారు. ఇరువర్గాల రాజీతో వాటిని పర్మినెంట్‌గా సెటిల్ చేసుకోవచ్చన్నారు. ప్రజలకు లీగల్ సర్వీస్‌కు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు. అంతకు ముందు విలేజ్‌లోని మోక్షానంద బుద్ద విగ్రహాన్ని జడ్జి విజిట్ చేశారు.