భారత్ దాడిలో పాక్ అణు కేంద్రం డ్యామేజ్..! సీక్రెట్ డేటా బయటకు..

భారత్ దాడిలో పాక్ అణు కేంద్రం డ్యామేజ్..! సీక్రెట్ డేటా బయటకు..

తాజాగా ఇండియా పాక్ దేశాల మధ్య కాల్పుల విరమణ కొనసాగుతున్న వేళ రెండు దేశాలు తమకు జరిగిన నష్టాల గురించి ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ తన మూడు ఎయిర్ బేసులపై ఇండియా దాడి చేసినట్లు ఒప్పుకుంది. ఇదే క్రమంలో ఒక యుద్ధ విమానానికి కూడా డ్యామేజీ జరిగినట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఇంత కీలక సమయంలో ఈజిప్ట్ ఎయిర్ ఫోర్స్ విమానం పాకిస్థానులో దిగటం సంచలన అనుమానాలకు దారితీస్తోంది.

వాస్తవానికి ఈజిప్టుకు చెందిన విమానం పాకిస్థానులో దిగినట్లు ఫ్లైట్ రాడార్ సమాచారం ప్రకారం వెల్లడైంది. అయితే పాకిస్థానులోని కీలక ఎయిర్ బేస్ సమీపంలోని అణు స్థావరాలకు డ్యామేజీ జరగటం వల్లనే ఇది వచ్చినట్లు పెద్ద చర్చ కొనసాగుతోంది. వాస్తవానికి 1986లో ఉక్రెయిన్ లో జరిగిన చెర్నోబిల్ ప్రమాద సమయంలో రేడియేషన్ తీవ్రతను తగ్గించేందుకు ఇసుక, బోరాన్, సీసం కలిపి ప్రభావిత ప్రాంతంలో చల్లటం జరిగింది. 

వాస్తవానికి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ల భద్రతకు బోరాన్-10 కీలకమైనది. ఇది రియాక్టర్లను నిర్వహించటంలో కీలకంగా వినియోగిస్తారు. అలాగే ఎమర్జెన్సీ న్యూక్రియల్ రెస్పాన్స్ సమయాల్లో బోరాన్ చాలా కీలకమైనది. ప్రస్తుతం పాకిస్థాన్ లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై భారత్ దాడిచేసిన వేళ దానికి సమీపంలోని అణు కేంద్రాలు ప్రభావితం అయ్యి ఉంటాయని తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఎయిర్ బేస్ పాకిస్తాన్ అణ్వాయుధాలను నిల్వ చేసే సదుపాయాలకు ఇది చాలా ముఖ్యమైనదిగా తెలుస్తోంది.

 

భవిశా రెండు దేశాల మధ్య పరిస్థితులు అణు దాడుల దిశగా మారుతున్నాయని అమెరికా నిఘా వర్గాలకు వచ్చిన సమాచారం వల్లనే ట్రంప్ రెండు దేశాలను కాల్పుల విరమణకు ఒప్పించి ఉంటారనే చర్చ కూడా మరోపక్క కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అణు బాంబులను ఎప్పుడు ఉపయోగించాలని నిర్ణయించే చిన్న బృందంతో నేషనల్ కమాండ్ అథారిటీ సమావేశాన్ని ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఏర్పాటు చేశారని పాక్ మీడియా పేర్కొంది. అయితే అక్కడి రక్షణ మంత్రి మాత్రం అలాంటిదేమీ లేదంటూ పేర్కొన్నారు. 

ఈ క్రమంలో ఈజిప్టులోని నైలు డెల్టాలో బోరాన్ పుష్కలంగా ఉంది. అసలు పాకిస్థాన్ కి అత్యవసరంగా ఈజిప్టు నుంచి ప్రత్యేక విమానం రావటంపై చాలా మంది బోరాన్ సరఫరా జరిగిందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అణు కేంద్రానికి డ్యామేజీ వల్లనే బోరాన్ తీసుకుని ఈజిప్ట్ విమానం పాక్ లోని కొండ జిల్లా మురీలోని ఒక చిన్న విమానాశ్రయంలో దిగిందని తెలుస్తోంది.