IPL 2025 రీషెడ్యూల్..బీసీసీఐ కీలక అప్డేట్.. ఆరు వేదికల్లో 17 మ్యాచ్లు

IPL 2025 రీషెడ్యూల్..బీసీసీఐ కీలక అప్డేట్.. ఆరు వేదికల్లో 17 మ్యాచ్లు

ఐపీఎల్ 2025 రీషెడ్యూల్ ప్రటకించింది బీసీసీఐ. ప్రభుత్వం ,భద్రతా సంస్థలతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత బోర్డు మిగిలిన సీజన్‌ను కొనసాగించాలని నిర్ణయించింది. మొత్తం 17 మ్యాచ్‌లు 6 వేదికలలో జరుగనున్నాయి.

భారత్,పాక్ ఉద్రిక్త పరిస్థితుల్లో ఆగిపోయిన మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ లను తిరిగి రీషెడ్యూల్ చేసింది బీసీసీఐ. మే 17, 2025 నుంచి తిరిగి ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి. జూన్ 3, 2025న ఫైనల్‌తో ముగిస్తాయి. సవరించిన షెడ్యూల్‌లో రెండు డబుల్-హెడర్లు ఉన్నాయి. ఇవి రెండు ఆదివారాల్లో జరగనున్నాయి. 

ప్లేఆఫ్‌లషెడ్యూల్ :

  • క్వాలిఫైయర్ 1 – మే 29 వరకు  
  • ఎలిమినేటర్ – మే 30 వరకు 
  • క్వాలిఫైయర్ 2 - జూన్ 1
  • ఫైనల్ – జూన్ 3

ప్లేఆఫ్ మ్యాచ్‌ల వేదిక వివరాలను తరువాత ప్రకటిస్తారు. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ( ఐపీఎల్ ) 2025 ఎడిషన్ మే 17న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ ,కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మధ్య మ్యాచ్‌తో తిరిగి ప్రారంభమవుతుంది. మిగిలిన మ్యాచ్‌లు ఆరు వేదికల్లో జరగనున్నాయి. మే 29న ప్లేఆఫ్‌లు ప్రారంభం కానున్నాయి. ప్లేఆఫ్‌ల వేదికలు ఇంకా ఖరారు కాలేదు. జూన్ 3న ఫైనల్ జరుగుతుంది. ప్రభుత్వం,భద్రతా సంస్థలతో చర్చల అనంతరం ఐపీఎల్ 2025 పునఃప్రారంభ నిర్ణయం తీసుకున్నట్లు ఐపీఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. 

సవరించిన ఐపీఎల్ షెడ్యూల్‌లో మే 18,25 తేదీల్లో రెండు డబుల్-హెడర్ మ్యాచ్‌లు ఉంటాయి. లీగ్ దశలో మిగిలిన 13 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చే ఆరు వేదికలు - బెంగళూరు, జైపూర్, ఢిల్లీ, లక్నో, ముంబై,అహ్మదాబాద్. ఢిల్లీ క్యాపిటల్స్ హోమ్ మ్యాచ్‌తో పాటు, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం రెండు తటస్థ మ్యాచ్‌లను నిర్వహించనుంది. 

జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో మొదట కేటాయించిన దానికంటే రెండు మ్యాచ్‌లను అధికంగా నిర్వహించనున్నారు. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ ,ఢిల్లీ క్యాపిటల్స్ రద్దు చేయబడిన మ్యాచ్‌ను మళ్ళీ నిర్వహించనున్నారు .మే 24న జైపూర్‌లో తిరిగి షెడ్యూల్ చేశారు.

తేదీ      రోజు    సమయం (IST)    మ్యాచ్              వేదిక
మే 17    శని       రాత్రి 7:30               RCB vs KKR    బెంగళూరు
మే 18    ఆది     మధ్యాహ్నం 3:30    RR vs PBKS      జైపూర్
మే 18    ఆది      రాత్రి 7:30               DC vs GT           ఢిల్లీ
మే 19    సోమ    రాత్రి 7:30              LSG vs SRH       లక్నో
మే 20    మంగళ    రాత్రి 7:30          CSK vs RR         ఢిల్లీ
మే 21    బుధ    రాత్రి 7:30               MI vs DC           ముంబై
మే 22    గురు    రాత్రి 7:30               GT vs LSG         అహ్మదాబాద్
మే 23    శుక్ర      రాత్రి 7:30              RCB vs SRH    బెంగళూరు
మే 24    శని      రాత్రి 7:30               PBKS vs DC     జైపూర్
మే 25    ఆది     మధ్యాహ్నం 3:30    GT vs CSK    అహ్మదాబాద్
మే 25    ఆది      రాత్రి 7:30             SRH vs KKR    ఢిల్లీ
మే 26    సోమ      రాత్రి 7:30           PBKS vs MI    జైపూర్
మే 27    మంగళ    రాత్రి 7:30         LSG vs RCB    లక్నో
మే 29    గురు      రాత్రి 7:30             క్వాలిఫైయర్ 1    శుక్రవారం
మే 30    శుక్ర       రాత్రి 7:30    ఎలిమినేటర్    శుక్రవారం
జూన్ 1    ఆది      రాత్రి 7:30    క్వాలిఫైయర్ 2    శుక్రవారం
జూన్ 3    మంగళ    రాత్రి 7:30    ఫైనల్    శుక్రవారం