అదృష్టాన్ని పట్టేశాడబ్బా:ఆ లాటరీపై15 ఏళ్లుగా ప్రయత్నం..ఎట్టకేలకు రూ.8 కోట్లు గెలిచిన ఇండియన్..

అదృష్టాన్ని పట్టేశాడబ్బా:ఆ లాటరీపై15 ఏళ్లుగా ప్రయత్నం..ఎట్టకేలకు రూ.8 కోట్లు గెలిచిన ఇండియన్..

కృషి ఉంటే మనుషులు రుషులు అవుతారు అనేది సామెత.. లాటరీ కోసం కృషి చేయటం..ఆ లాటరీ ఎలాగైనా గెలుచుకోవాలనే తపన, కసి ఉంటే మాత్రం..అదృష్టాన్ని ఎవడు మాత్రం ఆపగలడు చెప్పండి..15 ఏళ్లుగా లాటరీలో గెలవాలనే తపన, కసితో ప్రతిసారీ ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.ఒకటి కాదు.. రెండు.. ఐదు కాదు.. ఏకంగా 15 ఏళ్లుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు 15వ సంవత్సరంలో తన అదృష్టాన్ని పట్టేశాడు..ఏకంగా 8 కోట్ల 50 లక్షల రూపాయల జాక్ పాట్తో..జీవితాన్ని సెటిల్ చేసుకున్నాడు కేరళ వ్యక్తి..ఈ లాటరీ విజేతపై పూర్తి వివరాలు..

యుఎఇలో పనిచేస్తున్న కేరళకు చెందిన 52 ఏళ్ల వేణుగోపాల్ ముల్లచ్చేరిని అదృష్టం వరించింది. ఇటీవల దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ డ్రా విజేతగా నిలిచి రూ.8.5కోట్ల (1 మిలియన్) జాక్‌పాట్‌ను గెలుచుకున్నాడు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్న ముల్లచ్చేరికి ఈ ప్రైజ్ అతన్ని లైఫ్ సేవర్ ని చేసింది. 

UAE లోని అజ్మాన్ లో ఐటీ సపోర్ట్ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్న ముల్లచ్చేరి.. గత 15ఏళ్లుగా లాటరీ గెలువాలని ప్రయత్నిస్తున్నాడు. నమ్మిన వ్యక్తి మోసం చేయడంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కున్న ముల్లచ్చేరీ అనేక కష్టాలు అనుభవించాడు. ఈ జాక్ పాట్ తనని నిజంగా రక్షించిందని ముల్లచ్చేరి చెబుతున్నాడు. తన జీవితంలో అనుభవించిన కష్టాలకు తెరపడిందన్నారు. అనందంతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానన్నాడు.

ఎన్ని బాధలు అనుభవించిన ముల్లచ్చేరి ఇండియాకు తిరిగి వస్తూ ఏప్రిల్ 23న దుబాయ్ ఎయిర్ పోర్టులో గోల్డెన్ టికెట్ కొనుగోలు చేశాడు. అదే అతడిని గట్టెక్కించింది. దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియం మిలియనీర్ 500వ డ్రా విజేతగా ముల్లచ్చేరి నిలిచాడు. ఇంకేముంది అతడి ఆనందానికి అవధులేకుండా పోయాయి. 
డ్రాలో వచ్చిన డబ్బుతో ముల్లచ్చేరి కుటుంబ సభ్యులతో భవిష్యత్తు ప్రణాళికలు వేసుకున్నాడు. దుబాయ్ అంటే ఎంతో ఇష్టపడే ముల్లచ్చేరి UAE లో కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. తన కుటుంబాన్ని కూడా దుబాయ్ తీసుకెళ్లాలనుకుంటున్నట్లు ముల్లచ్చేరి మీడియాతో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.  

ఇక ముల్లచ్చేరి విజయగాధ బాగా పాపులర్ అయింది. భారత్, గల్ఫ్ ప్రాంతాల్లోని చాలామందిని ఇది ఆకట్టుకుంది. సాధించాలని పట్టుదల, నమ్మకం, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే శక్తికి ముల్లచ్చేరి స్టోరీ నిదర్శనం. 123 దేశాల నుంచి 5వేల మంది పాల్గొనేవారి నుంచి 500వ మిలియనీర్‌గా ముల్లాచేరిని ఎంపిక చేస్తూ ట్వీట్ ద్వారా దుబాయ్ డ్యూటీ ఫ్రీ తన అభినందనలను వ్యక్తం చేసింది.