యూరిక్ యాసిడ్ ఇంత డ్యామేజ్ చేస్తుందా..? మెడిసిన్ లేకుండా తగ్గించే చిట్కాలు.. ట్రై చేయండి..!

యూరిక్ యాసిడ్ ఇంత డ్యామేజ్ చేస్తుందా..?  మెడిసిన్ లేకుండా తగ్గించే చిట్కాలు.. ట్రై చేయండి..!

ఒక దశాబ్దం క్రితం..  అంటే పదేళ్లకు ముందు.. జనాలు అంతో ఇంతో శారీరక శ్రమ చేసేవాళ్లు.. ఎక్కువగా ఇంటి భోజనం తినేవాళ్లు. అప్పట్లో యూరిక్ యాసిడ్ సమస్య తక్కువగా ఉండేది. ఉన్నా కూడా ఎక్కువగా జెనెటికల్ గా ఫ్యామిలీ నుంచి వచ్చేది. కానీ ఇప్పుడు.. ఎవరికి పడితే వాళ్లకు.. వయసుతో సంబంధం లేదు. యూరిక్ యాసిడ్ సమస్యలు వస్తూనే ఉన్నాయి. దీనికి మారుతున్న జీవన విధానం.. ఆహారపు అలవాట్లే కారణం. అయితే యూరిక్ యాసిడ్ అంటే ఏంటి..? ఎందుకు పెరుగుతుంది.. తగ్గించే మార్గాలు ఏంటో ఈ ఆర్టికల్ లో చూద్దాం.

యూరిక్ యాసిడ్:

యూరిక్ యాసిడ్ అంటే బాడీ, బ్లడ్ వదిలేస్తే మిగిలే వేస్ట్ పదార్థం. నైట్రోజన్ తో నిర్మితమైన ప్యూరిన్స్ వలన తయారయ్యే అవసరం లేని పదార్థం. ఎక్కువ శాతం బ్లడ్ లో ఉండే ప్యూరిన్స్.. మూత్రం ద్వారా బయటకు విసర్జించబడతాయి. అయితే ఇది బాడీలో ఎక్కువ అయితే ఆ కండిషన్ ను ‘హైపర్ యురిసీమియా’ అంటారు. ఈ కండిషన్ వలన చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి. 

ఎలా తయారవుతుంది:

ప్యూరిన్ రిచ్ ఫుడ్స్: అంటే రెడ్  మీట్ (మాంసం), గవ్వలలో ఉండే మాంసం (షెల్ ఫిష్) అంటే పీతలు, రొయ్యలు, గవ్వలు మొదలైన ఆహార పదార్థాల వలన యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది. 

ఆల్కహాల్: ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వలన.. ముఖ్యంగా బీర్ వలన యూరిక్ యాసిడ్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. 

ఫ్రక్టోస్ ఆహార పదార్థాలు: షుగర్ ఎక్కువగా ఉండే డ్రింక్స్ (కూల్ డ్రింక్స్), ఆహార పదార్థాలు, అలాగే ఫ్రక్టోస్ అధికంగా ఉండే ఆహారం (అంటే కొన్ని పండ్ల) మొదలైన వాటి వలన కూడా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. 

జెనెటిక్స్: కుటుంబంలో ఎవరికైనా ఉంటే కూడా వచ్చే ప్రమాదం ఉంది

కిడ్నీ ఫంక్షనింగ్: కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్లలో యూరిక్ యాసిడ్ ను సరిగ్గా విసర్జింక పోవడం వలన బాడీలో పెరిగి పోతుంది. బీపీ, డయాబెటిక్ సమస్యలు ఉన్న వారిలో కూడా ఉంటుంది. 

లైఫ్ స్టైల్: ఎక్కువ నీళ్లు తాగక పోవడం, అధిక బరువు ఉండటం, శారీరక శ్రమ లేకపోవడం, స్ట్రెస్ (ఒత్తిడి) వలన కూడా ఈ సమస్య వస్తుంది. 

మెడిసిన్ లేకుండా ఇలా తగ్గించవచ్చు:

1. తిప్ప తీగ ఆకులు (Giloy leaves)

తిప్పతీగలో ఉన్న డిటాక్సిఫైయింగ్ లక్షణాలు యూరిక్ యాసిడ్ ను తగ్గిస్తాయి. బ్లడ్, కిడ్నీలో అధికంగా ఉన్న యూరిక్ యాసిడ్ ను బయటకు పంపించి కిడ్నీ ఫంక్షనింగ్ ను మెరుగు పరుస్తుంది. 

2. వేప ఆకులు (నీమ్ లీవ్స్): 

వేప ఆకుల్లో యాంటీ-ఇన్ ఫ్లేమేటరీ, పూరిఫైయింగ్ ఏజెంట్స్.. బ్లడ్ ఎక్కువగా యూరిక్ యాసిడ్ నిలవ ఉంచకుండా తోడ్పడుతాయి. 

3. కొత్తిమీర (కోరియాండర్): 

కొత్తిమీరలో డైయూరిటిక్ అనే లక్షణాలు కలిగి ఉంటాయి. అంటే యూరిక్ యాసిడ్ ను డైల్యూట్ చేసే లక్షణాలు. మూత్రం ద్వారా యూరిక్ యాసిడ్ ను బయటకు పంపిస్తుంది. 

4. మారేడు పత్రాలు : 

మారేడు పత్రాలు బాడీ మెటబాలిజం ను ఇంప్రూవ్ చేస్తాయి. కణాల జీవక్రియను వృద్ధి చేస్తాయి. దీని వలన యూరిక్ యాసిడ్ ఉత్పత్తి తగ్గుతుంది. 

5. తమల పాకులు (బీటల్ లీవ్స్):

తమలపాకులు జీర్ణక్రియను పెంపొందిస్తాయి. అలాగే డీటాక్సిఫికేషన్ .. అంటే శరీరంలో ఉన్న విషపూరిత పదార్థాలను తొలగిస్తాయి. దీంతో బాడీలో ఉండే అధిక యూరిక్ యాసిడ్ బయటికి వెళ్లిపోతుంది.