అలాంటి వాళ్లు వీధి కుక్కలను పెళ్లి చేసుకోవచ్చు కదా.. రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్స్ !

అలాంటి  వాళ్లు వీధి కుక్కలను పెళ్లి చేసుకోవచ్చు కదా.. రాంగోపాల్ వర్మ సంచలన ట్వీట్స్ !

ఇటీవల సోషల్ మీడియాలో మోస్ట్ డిస్కసింగ్ టాపిక్ ఏదైనా ఉందా అంటే స్ట్రీట్ డాగ్స్ గురించే. ఢిల్లీలో 8 వారాల్లోగా వీధి కుక్కులు కనిపించకూడదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత వివాదం మొదలైంది. వీధి కుక్కలను తరలించడంపై పలువురు సెలెబ్రిటీలో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ వస్తున్నారు. వీధి కుక్కలను చంపొద్దు.. తరలిస్తే ఎక్కడ తరలిస్తారు.. వాటికి షెల్టర్లు కూడా లేవు.. తరలిస్తున్నట్లు చేసి చంపేస్తారని గగ్గోలు పెడుతున్నారు. కొందరైతే ఏకంగా బోరున ఏడ్చేశారు కూడా. 

సెలెబ్రిటీల వైఖరిపై కొందరు తీవ్ర విమర్శలకు దిగారు. కాలు కిందపెట్టకుండా.. కార్లలో తిరిగే వారికి వీధి కుక్కల బెడద ఏం తెలుస్తుందని మండిపడుతున్నారు సామాన్యులు. పిల్లలను కరిచి చంపినపుడు ఆ నోర్లు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. ఈ సమయంలో డాగ్ లవర్స్ వైఖరిపై దర్శకుడు రాంగోపాల్ వర్మ చాలా తీవ్రంగా స్పందించారు. ఎక్స్ లో వరుసగా పోస్టులు పెడుతున్నారు. డాగ్ లవర్స్ కు సూచనలు చేస్తూ ఎక్స్ లో పెద్ద పోస్ట్ లు పెట్టారు. వీధి కుక్కల అంశంపై వర్మ ట్వీట్స్ వైరల్ గా మారాయి. పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. 

వర్మ ట్వీట్స్ లో ఏముంది..?

స్ట్రీట్ డాగ్స్ ను కాపాడుకునేందుకు ఫెంటాస్టిక్ సొల్యూషన్స్ చెబుతున్నానని ట్వీట్ చేశారు వర్మ. అందులో ముఖ్యమైన పాయింట్స్:

  • పేద ప్రజలను అడాప్ట్ చేసుకుని ఇంట్లో పెట్టుకోవాలి.. వీధులను కుక్కలకు వదిలిపెట్టాలి
  • ఒకవేళ డాగ్స్ మీ ఫ్యామిలీలో భాగమైతే వాటిని ఎందుకు పెళ్లి చేసుకోరు
  • మీ పిల్లలను డాగ్స్ తో ఆడుకునేందుకు వీధుల్లోకి ఎందుకు పంపరు.. అలా పంపితే ప్రకృతితో బంధం పెరుగుతుంది కదా
  • వీధుల్లో కుక్కలు ఫ్రీగా తిరగాలి కదా.. అలాంటప్పుడు మీ పెంపుడు కుక్కలను ఎందుకు వీధుల్లోకి పంపరు. అవి ఎంత వరకు బతుకుతాయో చూడాలి కదా
  • పిల్లలకంటే వీధి కుక్కలకు హక్కులు ఎక్కువగా ఉంటాయని మీరు అనుకుంటే.. డాగ్స్ కు స్కూల్స్ కట్టించండి.. 
  • ఏసీ బెడ్ రూమ్ లు ఖాళీ చేసి వీధి కుక్కలకు ఎందుకు ఇవ్వరు.. అవి ప్రశాంతంగా జీవిస్తాయి కదా
  • మనుషులకంటే కుక్కలనే ఎక్కువగా ఆరాధిస్తే.. టెంపుల్స్ లో దేవతల బదులు కుక్కలను పెట్టి పూజించొచ్చు కదా
  • అడాప్ట్ ఏ డాగ్.. కిల్ ఏ చైల్డ్.. కుక్కలను పెంచుకుని.. పిల్లలను చంపండి.. అనే ఫౌండేషన్ స్టార్ట్ చేయండి
  • దేశ వ్యాప్తంగా వీధి కుక్కలు మనుషులను కొరికి, చంపుతున్నాయి .. కానీ డాగ్ లవర్స్ మాత్రం వాటి హక్కుల గురించి ట్వీట్లు చేస్తూ బిజీగా ఉన్నారు.
  • రిచ్ పీపుల్ హైబ్రీడ్ పెంపుడు కుక్కలను పెంచుకుంటున్నారు. కానీ పేదవాళ్లు వీధి కుక్కల దాడికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్లాస్ డివైడ్ గురించి డాగ్ లవర్స్ మాట్లాడరు. 
  • ఒక మనిషి చంపితే హంతకుడు అంటున్నారు. కానీ ఒక కుక్క మనిషిని చంపితే దానిని యాక్సిడెంట్ అంటున్నారు.  మరి మనుషులు జంతువుల్లా చంపితే దాన్ని కూడా యాక్సిడెంట్ అంటారా..?
  • మీరు కుక్కల కోసం కన్నీరు కారుస్తారు, కానీ చనిపోయిన మనుషుల కోసం కాదు. ఇంత సెలెక్టెడ్ గా సింపతీ ఉంటుందని ఎన్నడూ అనుకోలేదు
  • “వీధి కుక్కలను చంపవద్దు” అని చెప్పడం బదులు,  వాటిని ఎందుకు దత్తత తీసుకోరు?  ఎందుకంటే అవి లో బ్రీడ్ ఉన్నవి.. మురికి, వ్యాధులు ఉన్నవి, అవి మీకు ప్రమాదకరం కాబట్టి కాదా? 
  • గేట్లు ఉన్న కాలనీల్లో వీధి కుక్కలు దాడి చేయవు. గేట్లు లేని చోటే అవి దాడి చేస్తాయి. 
  • ఒక తల్లి తన పిల్లాడు కుక్కలు కొరుకుతుండటం చూస్తూ తల్లడిల్లి పోతోంది.. ఆమె కోసం మీరు ఎందుకు ఒక హ్యాష్‌ట్యాగ్ క్రియేట్ చేయరు?
  • కుక్కలు మాత్రమే కాదు, అన్ని జంతువులకు బ్రతికే హక్కు ఉంటుంది. కానీ మనుషుల ప్రాణాల కంటే ఎక్కువ విలువైనవా..? 

ఈ విధంగా వర్మ డాగ్ లవర్స్ కు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. తన మిత్రుడు సిరాశ్రీ షేర్ చేసిన స్ట్రీట్ డాగ్స్ లెక్కలకు సంబంధించిన వివరాలను షేర్ చేశారు వర్మ. దేశంలో 96 శాతం రేబిస్ కేసులు వీధి కుక్కల నుంచే వస్తున్నాయి. 2024లో దాదాపు 40 లక్షల కుక్క కాట్లు నమోదయ్యాయి. 2022 నుంచి 70 శాతం కుక్క కాట్లు పెరిగిపోయాయి.. అంటూ ఎక్స్ లో షేర్ చేశారు వర్మ. వర్మ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.