
'ది కశ్మీర్ ఫైల్స్’ మూవీతో మెప్పించిన వివేక్ అగ్నిహోత్రి.. ‘ది బెంగాల్ ఫైల్స్’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. లేటెస్ట్గా ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. 1946 కలకత్తా అల్లర్ల ఆధారంగా రూపొందించబడిన ఈ మూవీ ట్రైలర్ ఆసక్తిగా సాగింది.
పశ్చిమ బెంగాల్ హింసాత్మక రాజకీయ వేడి, విభజన తర్వాత హిందువులపై జరిగిన ఊచకోతను వెలుగులోకి తీసుకురానుందని తెలుస్తోంది. 'ఇక్కడ రెండు రాజ్యాంగాలు ఉన్నాయి. ఒకటి హిందువులకు మరియు మరొకటి ముస్లింలకు' అనే డైలాగ్తో ట్రైలర్ మొదలైంది.
ఇది విభజన గురించి మాత్రమే కాదు, ఎందుకంటే బెంగాల్ భారత్ యొక్క లైట్‌హౌస్' అనే మరో డైలాగ్ ఆలోచింపజేసేలా ఉంది. ఓవరాల్గా బెంగాల్‌లో ప్రజలు ఎదుర్కొన్న నాటి సమస్యలను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఉత్కంఠ కలిగేలా చూపించారు. 3 నిమిషాల 32 సెకెన్ల పాటు సాగిన సీన్స్, సినిమా కథనంపై ఆసక్తిని పెంచాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆడియన్స్ హృదయాలను కదిలించేలా ఉంది.
ఈ మూవీలో వర్సటైల్ యాక్టర్స్ మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, గోవింద్ నామ్‌దేవ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. పల్లవి జోషి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది. సెప్టెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా సినిమా విడుదల కానుంది.