
సైబర్ మోసాలు రోజురోజుకి కొత్త కొత్త దారుల్లో పుట్టుకొస్తున్నాయి. దీనికి సంబంధించి ఎన్ని హెచ్చరికలు చేసిన, జాగ్రత్తలు చేపట్టిన ఎదో ఒక మూలాన సైబర్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొత్తగా ఇప్పుడు వాట్సాప్ స్క్రీన్ మిర్రరింగ్ ఫ్రాడ్ వెలుగులోకి వచ్చింది.
దింతో వాట్సాప్ స్క్రీన్ మిర్రరింగ్ ఫ్రాడ్ గురించి వన్ కార్డ్ కస్టమర్లను హెచ్చరించింది. ఈ రకమైన మోసం ద్వారా పర్సనల్ వివరాలు సహా మీ అకౌంట్ ఖాళీ అవ్వొచ్చని తెలియజేసింది. వన్ కార్డ్ అనేది ఒక క్రెడిట్ కార్డు కంపెనీ.
OneCard ఎం చెప్తుందంటే : ఈ రకమైన స్కామ్‌లో సైబర్ కేటుగాళ్లు మిమ్మల్ని నమ్మించడానికి మొదట బ్యాంకు లేదా ఏదైనా కంపెనీ ఉద్యోగి అని చెప్తూ మీ అకౌంట్లో సమస్య ఉందని వాట్సాప్ ద్వారా స్క్రీన్-షేరింగ్ ఎనేబుల్ చేయమని అడుగుతారు. ఈ విధంగా OTPలు, బ్యాంక్ వివరాలు, పాస్‌వర్డ్‌లు, పర్సనల్ మెసేజులు మొదలైన సమాచారాన్ని దొంగతనం చేస్తారు.
►ALSO READ | eSIM పేరుతో మోసం..క్షణాల్లో రూ.4లక్షల కాజేసిన సైబర్ నేరగాళ్లు
ఒకోసారి మీ మొబైల్లో కీలాగర్ లేదా కీబోర్డ్ లాగర్ ఇన్‌స్టాల్ చేస్తారు. మీరు ఎం టైప్ చేస్తారో చూసేందుకు ఇదో రకమైన సాఫ్ట్‌వేర్. చాల బ్యాంకింగ్ వెబ్‌సైట్‌లు ఆన్-స్క్రీన్ కీబోర్డ్‌ను అందించడానికి ఇదే కారణం, ఎందుకంటే కీలాగర్ ఆన్-స్క్రీన్ కీబోర్డ్‌ని ఉపయోగించి మీరు టైప్ చేసేది తెలుసుకోవచ్చు. మీ ఫోన్లో కీబోర్డ్ లాగర్‌ను ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లు, సోషల్ మీడియా పాస్‌వర్డ్‌లు అన్ని దొంగిలించొచ్చు. తరువాత సైబర్ స్కామర్లు మీ స్క్రీన్‌పై వన్-టైమ్ పాస్‌వర్డ్‌లు (OTPలు), బ్యాంకింగ్ యాప్ యాక్టివిటీ, UPI పిన్‌లు, పర్సనల్ మెసేజులు, ఐడి ప్రూఫులు ఈజీగా తెలుసుకోవచ్చు.
మీరు చేయకూడనివి: తెలియని లేదా అనుమానాస్పద నంబర్ల నుండి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయడం మానేయండి. స్క్రీన్ షేరింగ్ సమయంలో ఎప్పుడూ మొబైల్ బ్యాంకింగ్, UPI యాప్‌లు, ఈ-వాలెట్‌లు ఓపెన్ చేయొద్దు. మీకు ఏదైనా అనుమానం ఉంటే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయవచ్చు లేదా https://cybercrime.gov.in/లో తెలియజేయవచ్చు.