వాట్సాప్లో కాల్ షెడ్యూల్ ఎలా చేయాలంటే..

వాట్సాప్లో కాల్ షెడ్యూల్ ఎలా చేయాలంటే..

వాట్సాప్లో గ్రూప్ చాట్స్, గ్రూప్ మీటింగ్స్ జరుగుతూనే ఉంటాయి. అయితే, ఒక్కోసారి ఏదైనా మీటింగ్​కి చెప్పిన టైం గుర్తుండదు. అందుకే వాట్సాప్​లో కాల్ షెడ్యూల్ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చింది కంపెనీ. ఫలానా టైంకి అందరూ వాట్సాప్​ కాల్​లోకి రావడం కోసం ముందుగానే టైం షెడ్యూల్ చేసుకోవచ్చు. ఇతరులను ఇన్వైట్ చేయొచ్చు. తద్వారా కాల్ స్టార్ట్ అయ్యేముందు వాట్సాప్ అందరినీ అలర్ట్ చేస్తుంది. అంతేకాదు.. ఇన్ కాల్ ఇంటరాక్షన్​ టూల్స్ ద్వారా కాల్ మాట్లాడుతున్నప్పుడే ఎమోజీలతో రియాక్ట్ అవ్వొచ్చు.

కాల్ షెడ్యూల్ ఎలా చేయాలంటే.. వాట్సాప్​ ఓపెన్ చేసి కాల్స్ ట్యాబ్​కి వెళ్లాలి. కాల్​ ఐకాన్​పై ట్యాప్ చేసి, కాల్ చేసే కాంటాక్ట్ లేదా గ్రూప్​ను సెలక్ట్ చేసుకోవాలి. తర్వాత షెడ్యూల్ కాల్ ఆప్షన్ ఎంచుకుని, డేట్, టైం సెట్ చేయాలి. వీడియో కాల్ లేదా ఆడియో కాల్ కూడా సెట్ చేయొచ్చు. ఆపై గ్రీన్​ బటన్​ను ట్యాప్ చేయాలి. దాంతో షెడ్యూల్ కాల్ అప్​ కమింగ్ కాల్స్​ లిస్ట్​లో కనిపిస్తుంది. అలాగే వాట్సాప్​లో మీరు ఎంచుకున్న వాళ్లందరికీ రిమైండర్​ సెండ్ చేస్తుంది.