
గూగుల్ అమెరికా, జపాన్, ఇండోనేసియా, దక్షిణ కొరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో యూనివర్సిటీ విద్యార్థులకు ఏఐ ప్రొ ప్లాన్‌ను ఫ్రీగా సర్వీస్ చేస్తోంది. ఈ ఆఫర్‌తో స్టూడెంట్స్ గూగుల్ అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, టూల్స్‌ను ఒక సంవత్సరంపాటు ఉచితంగా వాడుకోవచ్చు. ఈ ఆఫర్‌ని వాడుకోవాలంటే అక్టోబర్ 6వ తేదీలోపు మెంబర్షిప్ తీసుకోవాలి. త్వరలోనే ఈ ఆఫర్ మన దేశంలోని విద్యార్థులకూ అందుబాటులోకి రానుంది.
గూగుల్ ఏఐ ప్లాన్‌లో జెమిని 2.5 ప్రో, డీప్ రీసెర్చ్ మోడల్ యాక్సె, వియో 3 ద్వారా వీడియో జనరేషన్, వెర్టెక్స్ ఏఐలో వియో 3 ఫాస్ట్‌కు లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది. ఇవే కాకుండా నెలనెలా వెయ్యి ఏఐ క్రెడిట్స్ వస్తాయి. వాటితో టెక్స్ట్, ఇమేజ్, వీడియో జనరేషన్ చేయొచ్చు. నోట్‌బుక్ ఎల్‌ఎమ్‌లో నోట్ బుక్స్, ఆడియో ఓవర్ వ్యూలు హైక్వాలిటీతో వాడుకోవచ్చు. డాక్స్, షీట్స్, స్లైడ్స్ లాంటి గూగుల్ యాప్స్‌లో జెమిని ఏఐ యాక్సెస్ ఉంటుంది. ఈ ప్లాన్‌లో అందించే ఈ సర్వీస్‌లను స్టూడెంట్స్ తమ స్టడీకి, టెక్నాలజీ మీద నాలెడ్జ్‌ను పెంచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు.