
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 09.
- పోస్టుల సంఖ్య: 491.
- పోస్టులు: అసిస్టెంట్ ఇంజినీర్ 81, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 410.
- ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ, బి.టెక్ లేదా బీఈ, ఎల్ఎల్బీ, సీఏ, ఐసీఎస్ఐలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
- వయోపరిమితి: కనిష్ట వయోపరిమితి 21 ఏండ్లు. గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
- అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
- అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 16.
- లాస్ట్ డేట్: సెప్టెంబర్ 09.
- ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్: అక్టోబర్ 10.
- మెయిన్ ఎగ్జామ్ డేట్: నవంబర్ 08.
- అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.85. ఇతరులకు రూ.700.
- సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష(ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
- పూర్తి వివరాలకు licindia.in వెబ్సైట్లో సంప్రదించగలరు.