టాలీవుడ్ సంక్షోభం.. నిర్మాతలు, కార్మికుల మధ్య రాజీకి చిరంజీవి మధ్యవర్తిత్వం

టాలీవుడ్ సంక్షోభం..  నిర్మాతలు, కార్మికుల మధ్య రాజీకి చిరంజీవి మధ్యవర్తిత్వం

గత కొన్ని రోజులుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిర్మాతలు, సినీ కార్మికుల మధ్య వేతనాల వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సినీ కార్మికుల ఫెడరేషన్ తమ వేతనాలను 30 శాతం పెంచాలని పట్టుబడుతుండగా, నిర్మాతలు మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. ఈ ప్రతిష్టంభన కారణంగా గత 14 రోజులుగా అన్ని షూటింగ్‌లు నిలిచిపోయాయి. ఈ వివాదం రోజురోజుకు ముదురుతుండడంతో, సమస్య పరిష్కారం కోసం మెగాస్టార్ చిరంజీవిని ప్రయత్నిస్తున్నారు.

ఈ రోజు (ఆగస్టు 17, 2025) చిరంజీవితో ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ చర్చలో, కల్యాణ్ సినీ కార్మికుల డిమాండ్లు, నిర్మాతల వాదనలు, ప్రస్తుతం పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను చిరంజీవికి వివరించారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సి. కళ్యాణ్, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో కార్మికుల వేతనాలు ఇప్పటికే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. సమ్మె కారణంగా చిన్న నిర్మాతలు ఎక్కువగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 చిత్ర సీమలో నెలకొన్న సమస్య సాల్వ్ అవ్వాలని చిరంజీవి ప్రతిరోజు  తమతో ఫాలోప్ చేస్తూనే ఉన్నారని తెలిపారు . రేపు చిరంజీవిని ఫెడరేషన్ సభ్యులు కలవనున్నారని, తన వంతుగా కార్మికులతో మాట్లాడి సమస్యకు ముగింపు పలికేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారని వెల్లడించారు.  ఇటు నిర్మాతలు, అటు కార్మికులు బాగుండాలని చిరంజీవి కోరుకుంటున్నారని చెప్పారు.  

 నిర్మాతల ప్రతిపాదనలను గతంలోనే ఒప్పుకున్నా  ఇంకా అమలు లోకి రావటం లేదు. నిర్మాతల వీక్నెస్ వల్లే అవి జరగటం లేదని కల్యాణ్ అన్నారు. అయితే అవేమి కష్టమైనవి కాదు.. వర్కర్స్ ను కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.  లేబర్ కమీషనర్ రికార్డ్ రూల్స్ ప్రకారం సినిమాలకు వర్క్ చేయలేము. ఓ ఫ్యామిలీ లా  కలిసి వర్క్ చేసుకోవటం అలవాటు అయిపొయిందని అన్నారు.   ఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ కూడాసమస్య  పరిష్కారానికి కృషి చేస్తున్నారని సి. కాల్యాణ్ చెప్పారు.   రెండు రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.