
మహిళలకు రక్షణ కరువైంది. సాధారణ మహిళలే కాదు ఖాకీ చొక్కా వేసుకున్న మహిళలకు కూడా సేఫ్టీ లేకుండా పోయింది. పై స్థాయి అధికారుల నుంచి వేధింపులు తప్పడం లేదు. నల్గొండ జిల్లాలో ఓ మహిళా కానిస్టేబుల్ ను వేధించిన ఓ ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకున్నారు ఉన్నతాధికారులు. ఎన్ని సార్లు చెప్పిన తన వక్ర బుద్ధి మార్చుకోకపోవడంతో విచారణ జరిపి ఎస్ఐని సస్పెండ్ చేశారు.
సూర్యాపేట జిల్లా నూతనకల్ పాత ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పై మరోసారి వేటు పడింది. ఓ మహిళా కానిస్టేబుల్ ని వేధిస్తున్నట్లు గతంలో ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై విచారణ అనంతరం రేంజ్ ఆఫీసుకు ఏటాచ్ చేశారు ఐజీ. మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదుతో స్పెషల్ టీంతో ఎంక్వయిరీ చేయించారు జిల్లా ఎస్పీ నరసింహ. మహిళా కానిస్టేబుల్ పై ఎస్ఐ ప్రవీణ్ కుమార్ వేధింపులు నిజమే అని తేలడంతో చర్యలు తీసుకుంది పోలీస్ శాఖ. ఎస్సైని సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు. మహిళలపై అగౌరవంగా ప్రవర్తిస్తే ఎవరైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలోనూ ఎస్ ఐ ప్రవీణ్ కుమార్ పై అనేక ఆరోపణలు, సస్పెన్షన్ లు ఉన్నాయి .అయినా తన ప్రవర్తన మార్చుకోకపోవడంతో ఎస్ఐ విచారణ జరిపిన ఉన్నతాధికారులు మరోసారి వేటు పడింది.
►ALSO READ | ఒకటా.. రెండా.. సరోగసీ పేరుతో డాక్టర్ నమ్రత ఎన్నెన్ని దారుణాలు చేసిందో చూడండి..!