ర్యాపిడో ఫుడ్ డెలివరీ యాప్ ‘Ownly.’. స్విగ్గీ, జొమాటోతో కంపేర్ చేస్తే 15 శాతం తక్కువ ధరకే ఫుడ్..

ర్యాపిడో ఫుడ్ డెలివరీ యాప్ ‘Ownly.’. స్విగ్గీ, జొమాటోతో కంపేర్ చేస్తే 15 శాతం తక్కువ ధరకే ఫుడ్..

స్విగ్గీ, జొమాటో, ఇప్పుడు జెప్టోలో కూడా.. ఇలా రకరకాల ప్లాట్​ఫామ్స్​లో ఫుడ్ దొరుకుతోంది. అందుకే ఫుడ్​ లవర్స్​ కోసం మరో ప్లాట్​ఫాం కూడా ఫుడ్ సర్వీస్​ అందించేందుకు కొత్త యాప్​నే తీసుకొచ్చింది.

ఇప్పటికే ట్రాన్స్​పోర్టేషన్​కి సంబంధించిన యాప్​ ఓలాలో ఫుడ్​ సర్వీస్​ స్టార్ట్ చేసింది. ఇప్పుడు అదే దారిలో రాపిడో కూడా పయనిస్తోంది. కేవలం ఫుడ్​ డెలివరీ కోసం ప్రత్యేకంగా ‘ownly’ అనే కొత్త యాప్​ను తీసుకొచ్చింది.

ఇండియాలో లాంచ్ చేసిన ఈ యాప్​ ప్రస్తుతం బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో ట్రయల్ సర్వీస్​ అందిస్తోంది. ఈ యాప్​ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్​లోడ్ చేసుకోవచ్చు. ఇతర ఫుడ్​ డెలివరీ యాప్​ల కంటే 15 శాతం తక్కువ ధరలకు ఈ యాప్‌ ఫుడ్​ని అందిస్తోంది.