జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో మరోసారి జల ప్రళయం.. ఏడుగురిని మింగేసింది !

జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో మరోసారి జల ప్రళయం.. ఏడుగురిని మింగేసింది !

జమ్ము: జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా వరద బీభత్సం సృష్టించింది. ఎడతెరిపి లేకుండా శనివారం, ఆదివారం కురిసిన వర్షాలకు పెద్ద ఎత్తున వరద వచ్చింది. కొండలపై నుంచి భారీగా వచ్చిన వరద.. కథువా‌‌‌‌‌‌‌ జిల్లాను అతలాకుతలం చేసింది.

కథువా జిల్లాలోని జోధ్ ఘాటీ, జంగోల్టే ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. సైనిక, పారామిలిటరీ దళాలు సహాయక చర్యల్లో తలమునకలయ్యాయి. జమ్మూకాశ్మీర్ కిష్త్వార్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ వల్ల సంభవించిన వరదలతో 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. 

కిష్త్వార్‌‌‌‌‌‌‌‌ జిల్లాలోని ఛోసిటీ గ్రామాన్ని వరద ముంచెత్తింది. సెక్యూరిటీ అవుట్ పోస్టు సహా ఇండ్లు, షాపులను నామరూపాల్లేకుండా చేసింది. ప్రముఖ మచైల్ (చండీ) మాతా యాత్రకు ఈ ఊరే బేస్‌‌‌‌ పాయింట్ కావడంతో.. గత గురువారం భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. అయితే మధ్యాహ్నం ఒక్కసారిగా వరద రావడంతో వందల సంఖ్యలో గల్లంతయ్యారు. 

►ALSO READ | బెంగళూరు : ప్లాస్టిక్ కంపెనీలో మంటలు.. ఐదుగురు మృతి