
బెంగళూరు: కర్నాటకలోని ప్లాస్టిక్ తయారీ యూనిట్లో అగ్నిప్రమాదం సంభవించింది. శనివారం తెల్లవారుజామున బెంగళూరు కేఆర్. మార్కెట్ సమీపంలోని నాగర్తపేటలో జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందినవారు నలుగురు ఉన్నారు. మరణించినవారిని భార్యాభర్తలైన సంగీత (33), మదన్ సింగ్ (38), వారి పిల్లలు రితేశ్ (7), విహాన్ (5)తో పాటు సురేశ్ కుమార్ (26)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. ఎనిమిది వాహనాల సహాయంతో మంటలను అదుపు చేశారు. విద్యుత్ స్పార్క్ వల్ల మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అగ్రిప్రమాదానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు.