
తెలంగాణలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు 18 వరకు ఈ వర్షాలు ఉంటాయని తెలిపింది. ఆగస్టు 16, 17న ఉత్తర, తూర్పు జిల్లాలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆగస్టు 16న ఏడు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ , ములుగు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. 8 జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. నిర్మల్ ,జగిత్యాల, పెద్దపల్లి, కరీంనగర్ ,హనుమకొండ, వరంగల్, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ మినహా మిగతా అన్ని జిల్లాలో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే రెడ్ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసిన అధికారులు.. జిల్లాల అధికారులను, యంత్రంగాన్ని అప్రమత్తం చేశారు.
ALSO READ : ఏడుపాయల గుడి మూసేశారు..
హైదరాబాద్ లో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఆగస్టు 16న ఈ రోజు హైదరాబాద్ కి ఎల్లో అలర్ట్ జారి చేసింది. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియాస్, మూసి పరివాహక ప్రాంతాలకు సంబంధించి హెచ్చరిక జారీ చేశామని, జిహెచ్ఎంసి, డిఆర్ఎఫ్ , మాన్సూన్ హైడ్రా, డిజాస్టర్ మేనేజ్మెంట్ తో పాటు అధికారులను అప్రమత్తం చేశామని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో మూడు రోజులు వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..