
తెలంగాణలో భారీవర్షాలు కురుస్తున్నాయి. వారం రోజులుగా కురిసిన వర్షాలకు వాగులు.. వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో ఉద్యోగస్తులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. అవపరమైతే తప్ప జనాలను బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. ఇదలా ఉండగా మెదక్ జిల్లాలో సింగూరు ప్రాజెక్ట్ కు భారీగా వరద చేరడంతో గేట్లు ఎత్తారు. వరద తాకిడితో ఏడుపాయల వనదుర్గా అమ్మవారి దేవాలయాన్ని మూసేశారు.
మెదక్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా మాత ఆలయాన్ని పూజారులు, అధికారులు మూసివేశారు. సింగూరు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో అమ్మవారి ఆలయం వద్ద మంజీరా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ఉధృతి తగ్గిన తర్వాత ఆలయాన్ని తెరుస్తామని అధికారులు తెలిపారు. అప్పటి వరకూ రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతాయని వెల్లడించారు. ఏటా భారీ వరద పోటెత్తడంతో అమ్మవారి ఆలయాన్ని ఇలా మూసివేస్తారు.